Viral Video: రైతా మజాకా..! అవమానం జరిగిన చోటే పొందిన గౌరవం.. రైతుకు క్షమాపణ మరియు డోర్ డెలివరీ..
ర్ణాటకలోని మహీంద్రా షోరూంలో రైతుకు జరిగిన అవమానం చర్చనీయాంశమైంది. తాజాగా బొలెరో పికప్ ట్రక్‌ను సిబ్బంది ఇంటికే వచ్చి అప్పగించారు. అసలేం జరిగిందంటే.. బొలెరో వాహనాన్ని కొనేందుకు రైతు కెంపెగౌడ ఈనెల 21న తుమకూరులోని మహీంద్రా షోరూంకి వెళ్లాడు. అయితే
ర్ణాటకలోని మహీంద్రా షోరూంలో రైతుకు జరిగిన అవమానం చర్చనీయాంశమైంది. తాజాగా బొలెరో పికప్ ట్రక్‌ను సిబ్బంది ఇంటికే వచ్చి అప్పగించారు. అసలేం జరిగిందంటే.. బొలెరో వాహనాన్ని కొనేందుకు రైతు కెంపెగౌడ ఈనెల 21న తుమకూరులోని మహీంద్రా షోరూంకి వెళ్లాడు. అయితే ఆ రైతును అవమానిస్తూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సేల్స్‌మెన్ దురుసుగా ప్రవర్తించాడు. ఆ కారు ధర 10 లక్షల రూపాయలని పేర్కొంటూ.. నీ దగ్గర 10 రూపాయలు కూడా ఉండవంటూ హేళన చేశాడు. దీంతో వారి మధ్య వాదన మొదలైంది. దీన్ని అవమానంగా భావించిన కెంపెగౌడ సేల్స్‌మెన్‌కు ఛాలెంజ్ విసిరి.. ఓ గంటలో రూ.10 లక్షలతో మళ్లీ షోరూంకి వెళ్లాడు.రైతు తెచ్చిన డబ్బు చూసిన సేల్స్‌మెన్ కంగుతిన్నాడు. డెలివరీకి నాలుగు రోజులు పట్టొచ్చని తెలిపారు. కాగా దురుసుగా ప్రవర్తించిన సేల్స్‌మెన్ క్షమాపణలు చెప్పాలని కెంపెగౌడతోపాటు అతని స్నేహితులు డిమాండ్ చేశారు. దీంతో మళ్లీ మాటా మాటా పెరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆ సేల్స్‌మెన్‌తో కెంపెగౌడకు క్షమాపణలు చెప్పించారు.
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

