IPL 2022: రెండో రోజు వేలానికి రెడీగా ఉన్న ప్లేయర్స్.. ఇందులో ప్రధాన ఆటగాళ్లు ఎవరెవరంటే..?
IPL 2022: IPL 2022 మెగా వేలం మొదటి రోజు జోరుగా సాగింది. మొత్తం10 ఫ్రాంచైజీలు భారతీయ, విదేశీ ఆటగాళ్ల కోసం డబ్బు ఖర్చు చేశాయి. ఇషాన్ కిషన్ 15.25 కోట్ల రూపాయలతో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు.
IPL 2022: IPL 2022 మెగా వేలం మొదటి రోజు జోరుగా సాగింది. మొత్తం10 ఫ్రాంచైజీలు భారతీయ, విదేశీ ఆటగాళ్ల కోసం డబ్బు ఖర్చు చేశాయి. ఇషాన్ కిషన్ 15.25 కోట్ల రూపాయలతో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్, అవేష్ ఖాన్ వంటి యువ భారత ఆటగాళ్లపై కూడా జట్లు ఆసక్తి కనబరిచాయి. అవేష్ ఖాన్ 10 కోట్లతో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. అయితే ఇది మొదటి రోజు జరిగిన చర్య మాత్రమే. ఈ మెగా వేలం రెండు రోజుల పాటు కొనసాగనుంది. రెండోరోజు ఆదివారం (ఫిబ్రవరి 13 ) కూడా వేలం కొనసాగుతుంది. మొదటి రోజు పరిస్థితిని ఈ విధంగా ఉంది. ఈ వేలం కోసం 600 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేయగా బిడ్డింగ్ కోసం 8 జట్లకు బదులుగా 10 జట్లు పాల్గొన్నాయి. మొదటి రోజు ప్రతి కేటగిరీకి చెందిన క్యాప్‌డ్, అన్‌క్యాప్డ్ ఆటగాళ్లని వేలం వేశారు. ఇందులో మొదటి రోజు 97 మంది ఆటగాళ్లను వేలం వేయగా మొత్తం 10 జట్లు మొత్తం 74 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగా 23 మంది ఆటగాళ్లు మిగిలారు. వీరు రెండోరోజు వేలంలో కూడా పాల్గొంటారు.
వేలం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
శనివారం మాదిరిగానే ఆదివారం కూడా మధ్యాహ్నం 12 గంటలకు వేలం ప్రారంభం కానుంది. శనివారం చీఫ్ వేలం నిర్వాహకుడు (వేలం అధికారి) హ్యూ ఎడ్మిడ్స్ వేలాన్ని ప్రారంభించాడు అయితే మధ్యలో ఆరోగ్యం క్షీణించడంతో ప్రెజెంటర్ చారు శర్మ బాధ్యతలు స్వీకరించారు. హ్యూ ఇప్పుడు బాగానే ఉన్నాడు ఆదివారం వేలం జరుగుతుంది.
జట్లు 20 మంది ఆటగాళ్ల పేర్లను ఇవ్వాలి
ముందుగా అన్ని ఫ్రాంచైజీలు తమకు నచ్చిన 20 మంది ఆటగాళ్ల జాబితాను ఉదయం 9 గంటలలోపు ఐపీఎల్ ముందు సమర్పించాలి. ఈ ఆటగాళ్లని ప్రత్యేకంగా వేలంలో చేర్చుతారు. మొదటి రోజు వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లను కూడా చేర్చుకోవచ్చు. ఆదివారం వేలం ప్రారంభమైనప్పుడు 98 నుంచి 161 వరకు ఉన్న ఆటగాళ్లను ముందుగా బిడ్ చేస్తారు. వాటి వేలం సాధారణ పద్ధతిలో జరుగుతుంది. అంటే జట్లకు ఆలోచించి వేలం వేయడానికి మరికొంత సమయం ఉంటుంది. తరువాత 162 నుంచి 600 నంబర్ల మధ్య ఉన్న ఆటగాళ్లను వేగవంతమైన వేలం వేస్తారు. అంటే ఫ్రాంచైజీలు ఎంపిక చేసిన ఆటగాళ్లు ఉంటారు.
రెండో రోజు హైలెట్‌గా నిలిచే కొంతమంది ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, జయదేవ్ ఉనద్కత్, చేతన్ సకారియా, కేదార్ జాదవ్, శివమ్ దూబే వంటి ప్రసిద్ధ ఆటగాళ్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో మార్నస్ లాబుస్‌చాగ్నే, రాసి వాన్ డెర్ డ్యూసెన్, తబ్రేజ్ షమ్సీ, జేమ్స్ నీషమ్, టిమ్ సౌతీ, పాల్ స్టిర్లింగ్, మార్టిన్ గప్టిల్, ఓడియన్ స్మిత్‌లు ఉన్నారు. వీరితో పాటు భారత అండర్-19 ప్రపంచకప్ విజేత జట్టు కెప్టెన్ యశ్ ధుల్, రాజ్ అంగద్ బావా వంటి యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు.