- Telugu News Photo Gallery Viral photos Interesting facts about frog who do not consume water with mouth
Viral Photos: భూమిపై ఈ జీవి చాలా ప్రత్యేకం.. నోటితో నీరు తాగదు.. చలి అంటే విపరీతమైన భయం..
Viral Photos: భూమిపై ఈ జంతువు చాలా ప్రత్యేకం. దీని గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. మిగిలిన వాటితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది.
Updated on: Feb 13, 2022 | 10:02 AM

భూమిపై ఈ జంతువు చాలా ప్రత్యేకం. దీని గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. మిగిలిన వాటితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. భూమిపై అన్ని జీవులు దాహం తీర్చుకోవడానికి నోటిని ఉపయోగిస్తాయి కానీ కప్ప మాత్రం చర్మంతో నీరు పీల్చుకుంటుంది.

భూమిపై నీరు తాగడానికి నోరు ఉపయోగించని ఏకైక జీవి కప్ప మాత్రమే. శరీరానికి నీటిని అందించడానికి ఇది చర్మాన్ని ఉపయోగిస్తుంది. అందుకే ఇది లోతైన నీటిలో కూడా ఈదుతుంది.

కప్ప చర్మం పై భాగం సెమీ పారగమ్యంగా ఉంటుంది. అంటే కొన్ని వస్తువులను దాటడానికి అనుమతించే ఒక మూలకం. కానీ కప్ప చలికి విపరీతంగా భయపడుతుంది. శీతాకాలంలో కప్ప సుమారు 2 అడుగుల మట్టి కిందకి వెళ్లి దాక్కుంటుంది. ఆకలితో ఉన్నా కూడా బయటకు రాదు.

కప్ప నీటిని పీల్చుకోవడమే కాదు ఆక్సిజన్, ఉప్పుని కూడా గ్రహిస్తుంది. మానవులు చేసే నీటి కాలుష్యం కప్పలపై పడుతుంది. ఎందుకంటే ఈ ప్రక్రియ కారణంగా అనేక మలినాలు దాని శరీరంలోకి చేరుతున్నాయి. దీంతో మరణిస్తున్నాయి.



