IPL 2022: ధోని కంటే చాహర్ పెద్ద ఆటగాడా.. 14 కోట్లు ఎందుకు చెల్లించినట్లు..?
IPL 2022: IPL 2022 వేలం మొదటి రోజున ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్లకు కొనుగోలు చేయగా దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.
IPL 2022: IPL 2022 వేలం మొదటి రోజున ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్లకు కొనుగోలు చేయగా దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. చాహర్‌పై ఇంత ఎక్కువ వేలం వేసిన తర్వాత భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఒక ప్రశ్న లేవనెత్తాడు. “దయచేసి ఎవరైనా దీన్ని వివరించగలరా.. చెన్నై చాహర్‌ను రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. ధోనీని రూ.12 కోట్లకు రిటైన్ చేసింది అయితే చాహర్.. ధోని కంటే పెద్ద ఆటగాడా” అని అడిగాడు. 2018 సంవత్సరంలో చెన్నై ఈ ఆల్‌రౌండర్‌ని రూ.80 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ నాలుగు సంవత్సరాలలో అతని ధర దాదాపు 18 రెట్లు పెరిగింది. ఒక ఆటగాడు కావాలంటే ఒక ఫ్రాంచైజీ ఎంతైనా చెల్లిస్తుందని చెన్నై నిరూపించింది. నిజానికి చాహర్‌ని పవర్‌ప్లే స్పెషలిస్ట్‌గా పిలుస్తారు. అతను CSK సెటప్‌లో భాగమయ్యాడు. ఆధునిక క్రికెట్‌లో చాలా మంది భారత ఫాస్ట్ బౌలర్లు వేయని బంతులను అతను స్వింగ్ చేస్తాడు. లోయర్ ఆర్డర్‌లో కూడా అతను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు.
CSK చాహర్ స్వింగ్ బౌలింగ్‌పై ఆధారపడి ఉంది. ఆ కోణంలో టీమ్ మేనేజ్‌మెంట్‌కు చాహర్ అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇంత పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేయాల్సి వచ్చింది. కెప్టెన్ కంటే చాహర్ సంపాదన ఎక్కువైనా తప్పలేదు.15.25 కోట్లకు ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో యువరాజ్ సింగ్ తర్వాత అత్యంత ఖరీదైన రెండో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఇషాన్ బేస్ ధర రూ.2 కోట్లు. 2011 ప్రపంచకప్‌లో భారత విజయం సాధించిన యువరాజ్‌ను 2015 సీజన్‌కు ముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) రికార్డు స్థాయిలో రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. ఏడాది తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.
Can someone please explain this:
CSK: Chahar gets Rs 14 cr, Dhoni retained for 12 cr.
MI: Kishan gets Rs 15.25 cr, Pollard retained for Rs 6 cr. @IPLAuctionLive
— Mohammad Kaif (@MohammadKaif) February 12, 2022