Chanakya Niti: మనిషి తన సంపాదనను ఈ నాలుగు విధాలుగా ఖర్చు చేయాలని సూచిస్తున్న చాణక్య..
Chanakya Niti:ఆచార్య చాణక్యుడు(Acharya Chanakya) మౌర్య వంశ స్థాపకుడిగా ప్రసిద్ధి చెందాడు. చాణుక్యుడు గొప్ప దౌత్యవేత్త, రాజకీయవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త. చాణుక్యుడు తన తెలివితేటలతో మొత్తం..
Chanakya Niti:ఆచార్య చాణక్యుడు(Acharya Chanakya) మౌర్య వంశ స్థాపకుడిగా ప్రసిద్ధి చెందాడు. చాణుక్యుడు గొప్ప దౌత్యవేత్త, రాజకీయవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త. చాణుక్యుడు తన తెలివితేటలతో మొత్తం నందవంశాన్ని నాశనం చేసి, ఒక సాధారణ పిల్లవాడైన చంద్రగుప్తుడిని సింహాసనంపై కూర్చోబెట్టాడు. చాణుక్యుడు చిన్నతనం నుంచి తన జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. తన జీవితానుభవాలను నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. మనిషి జీవన విధానం గురించి చాణుక్యుడు నీతిలో పేర్కొన్నాడు. ఈరోజు మనిషి ఎప్పుడు ఎలా ఖర్చు చేయాలో చెప్పిన విషయాలను తెలుసుకుందాం.
జబ్బుపడిన వ్యక్తులకు సహాయం: ఆచార్య చాణక్యుడు.. మనిషి సాధ్యమైనంత వరకూ అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు.. తమ శక్తి కొలదీ డబ్బు సాయం చేయాలని పేర్కొన్నాడు. ఇలా వ్యాధిగ్రస్తులకు సాయం చేయడం ఆ వ్యక్తి గౌరవాన్ని పెంచుతుంది. అంతేకాదు అటువంటి వ్యక్తి పట్ల దేవుడి కరుణ కలిగి ఉంటాడు. అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయకపోతే.. అనంతరం ఏదైనా చెడు జరిగినప్పుడు ఆ వ్యక్తి పశ్చాత్తాపపడవలసి ఉంటుందని పేర్కొన్నాడు.
పేదలకు సహాయం: నిరుపేదలకు సహాయం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని చాణక్య నీతిలో ప్రత్యేకంగా పేర్కొనబడింది. నిజంగా అవసరమైన వ్యక్తులకు డబ్బు ఖర్చు చేయడానికి ఎప్పుడూ వెనుకంజ వేయకూడదని చెప్పాడు. ముఖ్యంగా పేద పిల్లలకు చదువు చెప్పేందుకు విరాళం ఇవ్వగలిగిన వ్యక్తి పట్ల దేవుడు కరుణ కలిగి ఉంటాడు.
సామాజిక సేవ: ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక సేవ చేయడానికి ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని చాణుక్యుడు పేర్కొన్నాడు. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఆసుపత్రి, పాఠశాల వంటి నిర్మాణం ఖర్చు చేయడం వలన ఆ వ్యక్తి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలా చేసిన సహాయం పొందిన వారు సంతోషంగా ఉంటారు.
మతపరమైన ప్రదేశాలకు విరాళం: ఏదైనా మతపరమైన ప్రదేశాలకు దానం చేయడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయకూడదని, అలా చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని, జీవితంలో సానుకూలత వస్తుందని చాణక్య నీతిలో పేర్కొనబడింది. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో శాంతి, సంతోషం, ఐశ్వర్యం కూడా పెరుగుతాయి.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం, విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Also Read: