Valentine’s Day: రాశిని బట్టి డ్రస్ కలర్.. ప్రేమికుల రోజున ధరిస్తే.. లవ్ సక్సెస్ అయినట్టే..

ప్రేమ.. రెండు మనసుల కలయిక.. తెలియని ఓ ఉద్వేగం. ప్రతి చోట.. ప్రతి సమయంలో ప్రేమ ఉండిపోతుంది. ప్రతి ఒక్కరు తమ మనసులో

Valentine's Day: రాశిని బట్టి డ్రస్ కలర్.. ప్రేమికుల రోజున ధరిస్తే.. లవ్ సక్సెస్ అయినట్టే..
Valentine
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 13, 2022 | 5:01 PM

ప్రేమ.. రెండు మనసుల కలయిక.. తెలియని ఓ ఉద్వేగం. ప్రతి చోట.. ప్రతి సమయంలో ప్రేమ ఉండిపోతుంది. ప్రతి ఒక్కరు తమ మనసులో ఉన్నవారి కోసం ఈ వాలెంటైన్ వీక్‏ను ప్రత్యేకంగా జరుపుకుంటారు. మొదటి రోజు రోజ్ డే నుంచి మొదలుకొని.. చివరి రోజు వాలేంటైన్ డే వరకు ప్రతి రోజు తమకు తమకు ఇష్టమైన వారికి ప్రేమను తెలియజేస్తుంటారు. ప్రేమ.. మాటలకందని ఓ మధురానుభూతి. తమ జీవితంలో ముందుకు సాగడానికి తనకంటూ తోడు నిలిచే వ్యక్తి కోసం ప్రేమికుల రోజున స్పెషల్‏గా జరుపుకుంటారు. ప్రేమికుల రోజున జంటలు కలిసి.. వాగ్దానాలు చేసుకుంటారు. ఈరోజున ఎక్కువగా ప్రేమికులు ఒకేరకమైన రంగుల దుస్తులు ధరిస్తారు. అలాగే ఈరోజు ఇరువురి ఎదలోని మధుర భావాలను ఒకరికొకరు తెలియజేసుకుంటారు.

అయితే ప్రేమికుల రోజు అంటూ ప్రతి ప్రేమ జంట ఒక పండగ.. ఈరోజున తమ భాగస్వామి బాధపడుకూడదని.. ఎంతో సంతోషంగా ఉండేలా చూసుకుంటారు. మరీ అంత ప్రత్యేకమైన రోజున మీ రాశుల ప్రభావం కూడా మీరు ఎంజాయ్ చేసే రోజు మీద ఉంటే ఎలా ఉంటుంది. అవును.. ప్రేమికుల రోజు రాశిని బట్టి ఆయా రాశుల వారు ఆ రంగు దుస్తులు ధరిస్తే వారికి ఎదురు లేదంట.. మరీ అవెంటో తెలుసుకుందామా.

మేష రాశి.. ఈ రాశికి అధిపతి కుజుడు. మార్స్ అంటే ఎరుపు రంగు. వీరు ఏదైన పని మొదలు పెట్టినప్పుడు వారు కుంకుమ పువ్వు.. ఎరుపు రంగును ధరిస్తే శుభం కలుగుతుంది. ఇక ప్రేమికుల రోజున వీరు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే సంతోషం, ప్రేమ పెరుగుతుంది. భార్యభర్తల మధ్య వివాదాలు సమసిపోతాయి.

వృషభ రాశి. ఈరాశి వారు ప్రేమికుల రోజున పచ్చని (గ్రీన్) రంగు దుస్తులు ధరించడం వలన మేలు జరుగుతుంది. గ్రీన్ కలర్.. మనసులోని సానుకూల ఆలోచనలు.. ప్రేమను ఎదుటివారికి తెలియజేస్తుంది. అందుకే ప్రేమికుల రోజున గ్రీన్ కలర్ దుస్తులు ధరించాలి. ఈ రంగు జీవిత భాగస్వామికి మధ్య ప్రేమను తెలియజేస్తుంది.

మిథున రాశి.. ఈరాశి వారు పసుపు లేదా కుంకుమ రంగు ధరించడం మంచిది. అయితే వీరు ప్రేమికుల రోజున పింక్ కలర్ దుస్తులను ధరిస్తే అది మీ భాగస్వామికి మీపై ప్రేమను పెంచుతుంది. ఈరోజున మీరు లేత గులాబీ రంగును ఎంచుకోవడం వలన మీ జీవితం ప్రేమ రంగులతో నిండిపోతుంది.

కర్కాటక రాశి.. ఈరాశికి అధిపతి చంద్రుడు. అందుకే ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. వీరు వివాహం చేసుకుంటే ఎరుపు రంగు దుస్తులు ధరించడం వలన ప్రేమను.. అదృష్టాన్ని పెంచుతాయి.

సింహ రాశి.. ఈ రాశి వారు ప్రేమికుల రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఈరోజు పసుపు రంగు ధరించడం వలన పరస్పర ప్రేమలు పెరుగుతాయి.

కన్య రాశి.. ఈరాశివారు ప్రేమికుల రోజు నీలిరంగు (బ్లూకలర్) దుస్తులు ధరించి భాగస్వామిని ఆకట్టుకోవచ్చు. ఈ రంగు ధరించడం వలన పరస్పర ప్రేమ కొనసాగించడంలో సహాయపడుతుంది.

తులరాశి.. ఈరాశివారు ఏదైన శుభ సందర్భంలో నలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అయితే ప్రేమికుల రోజున వీరు తులరాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం వలన ప్రేమలు పెరుగుతాయి.

వృశ్చిక రాశి.. ఈరాశి వారు కుంకుమ పువ్వు రంగు దుస్తులు ధరిస్తే చాలా అదృష్టం ఉంటుంది. ఇరువురి మధ్య పరస్పరం ప్రేమ, అభిమానం పెరుగుతుంది.

ధనుస్సు రాశి.. ఈరాశి వారు ప్రేమికుల రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. వీరికి ఎరుపు రంగు శుభప్రదం. ఎరుపు రంగు ప్రేమను పెంచుతుంది.

మకర రాశి.. ప్రేమికుల రోజున ఈ రాశి వారు క్రీమ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచిది. క్రీమ్ కలర్ దుస్తులను ధరించడం వలన వీరి ప్రేమ బలంగా ఉంటుంది.

కుంభ రాశి.. ప్రేమికుల రోజున ఈ రాశివారు.. ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం మంచిది. ఈ రంగు దుస్తులు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావడానికి సహాయపడతాయి.

మీన రాశి.. ప్రేమికుల రోజున వీరు తెల్లని దుస్తులు ధరించడం మంచిది. ఈ రంగు దుస్తులు ప్రేమ, ఆనందాన్ని తెలియజేస్తాయి.

Also Read:  Sampoornesh Babu: మరోసారి మంచి మనసు చాటుకున్న సంపూర్ణేశ్‌ బాబు.. గుండె జబ్బుతో బాధపడుతోన్న రెండు నెలల చిన్నారికి.

Viral Photo: చెట్టును హత్తుకున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఇలా చేస్తే ఎన్నో లాభాలంటా..

Gehraiyaan: ‘స్కిన్​షో తప్ప ఏముంది..’ ‘గెహ్రాహియా’ చెత్త సినిమా అంటూ కంగనా సంచలన కామెంట్స్

Pawan kalyan-Harish Shankar: ‘భీమ్లా నాయక్‌’ సెట్‌లో సందడి చేసిన ‘భవదీయుడు’.. వైరల్ అవుతున్న ‘పవన్ కళ్యాణ్’ ‘హరీష్ శంకర్’ ఫొటోస్..