Gehraiyaan: ‘స్కిన్​షో తప్ప ఏముంది..’ ‘గెహ్రాహియా’ చెత్త సినిమా అంటూ కంగనా సంచలన కామెంట్స్

ప్రేమ, స్నేహం, వ్యక్తిగత సంబంధాలు.. వాటి పరిణామాల చుట్టూ ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ షకున్ బత్రా.  దీపికా పదుకునే- సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే- ధైర్యా కర్వా కీలక పాత్రల్లో నటించారు.

Gehraiyaan: 'స్కిన్​షో తప్ప ఏముంది..' 'గెహ్రాహియా' చెత్త సినిమా అంటూ కంగనా సంచలన కామెంట్స్
Kangana Deepika Padukone
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 13, 2022 | 12:47 PM

Kangana trolls Gehraiyaan: కంగనా రనౌత్.. కేరాఫ్ కాంట్రవర్సీ. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేస్తూ ఉంటుంది. ఆమె సోషల్ మీడియా వేదికగా పెట్టే పోస్టులు.. చాలా వివాదాస్పదంగా ఉంటాయి. కొన్నిసార్లు ఉద్రిక్తతలు కూడా చెలరేగేలా చేస్తాయి.  ఎప్పుడూ ఏదో ఓ విషయమై కంగనా వార్తల్లో ఉంటుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో( Amazon Prime Video)లో రిలీజైన ‘గెహ్రాహియా’ సినిమాపైనా పరోక్షంగా స్పందించిన కంగన.. సంచలన కామెంట్స్ చేసింది. మూవీలో లీడ్ రోల్ చేసిన దీపిక పదుకునే(Deepika Padukone)పై సెటైర్లు వేసింది. స్కిన్​షో-అశ్లీలత ఏ సినిమాను సేవ్ చేయలేవంటూ రాసుకొచ్చింది. తాను ఈ జనరేషన్‌కు చెందిన మనిషినే అని… కానీ ఇలాంటి రొమాన్స్​ను అర్థం చేసుకోగలను అని పేర్కొంది. న్యూ ఏజ్ సినిమా పేరుతో అలాంటి చెత్త మూవీస్ రిలీజ్ చెయ్యకండి అని పేర్కొంది. “బ్యాడ్​ మూవీస్ ఎప్పుడు బ్యాడ్ మూవీసే. స్కిన్​షో, రొమాన్స్ వాటిని ఏ మాత్రం సేవ్ చేయలేవు. ఇది చాలామందికి తెలిసిన విషయం” అని కంగన తన ఇన్​స్టా స్టోరీలో సుదీర్ఘంగా రాసుకొచ్చింది. ప్రస్తుతం కంగనా పోస్ట్  నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Kangana

ప్రేమ, ఫ్రెండ్షిప్, వ్యక్తిగత సంబంధాలు.. వాటి పరిణామాల చుట్టూ ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ షకున్ బత్రా.  దీపికా పదుకునే- సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే- ధైర్యా కర్వా కీలక పాత్రల్లో నటించారు. అలిషా, జైన్‌ అనే జంట ప్రయాణమే ‘గెహ్రాహియా’  కథ. ఈ మూవీకి సుమిత్‌ రాయ్‌ కథ అందించగా.. కరణ్‌ జోహర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ధర్మా ప్రొడక్షన్స్‌ హౌస్‌ నిర్మించింది. ఈ మూవీలో దీపికా నటనకు విమర్శకుల  ప్రశంసలు లభిస్తున్నాయి.

Also Read: ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు.. ఎందులో స్పెషలిస్టో తెలిస్తే.. బుర్ర బ్లాంక్ అవ్వడం ఖాయం