Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు.. ఎందులో స్పెషలిస్టో తెలిస్తే.. బుర్ర బ్లాంక్ అవ్వడం ఖాయం

Telangana News: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం దగ్గర చిన్న అమిరం గ్రామానికి చెందిన గూడాటి మహేష్‌ నూతన్‌కుమార్‌ ఆరేళ్ల క్రితం ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. భీమవరంలో మొబైల్‌ టెక్నీషియన్‌గా కొద్దికాలం పనిచేశాడు.

Hyderabad: ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు.. ఎందులో స్పెషలిస్టో తెలిస్తే.. బుర్ర బ్లాంక్ అవ్వడం ఖాయం
Telangana Crime News
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 12, 2022 | 4:07 PM

Crime News: ఇంజనీరింగ్‌ చదివిన ఓ యువకుడు విలాసాలకు అలవాటు పడి దొంగగా మారాడు. ఈ ఇంజనీరింగ్‌ దొంగ స్పెషాలిటీ ఏంటంటే… ఖరీదైన కార్లను చాకచక్యంగా కొట్టేయడం. నాలుగేళ్లుగా యదేశ్ఛగా కొనసాగుతున్న ఈ దొంగ దందా లో 26కు పైగా కార్లను దొంగిలించి చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District)భీమవరం దగ్గర చిన్న అమిరం గ్రామానికి చెందిన గూడాటి మహేష్‌ నూతన్‌కుమార్‌ ఆరేళ్ల క్రితం ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. భీమవరంలో మొబైల్‌ టెక్నీషియన్‌గా కొద్దికాలం పనిచేశాడు. విలాసాలకు అలవాటుపడ్డ మహేశ్‌ కృష్ణాజిల్లా(Krishna District) కొండపల్లికి చెందిన షేక్‌ మున్వర్‌, కొండా సాయిమదన్‌తో కలిసి ఖరీదైన కార్లు, ద్విచక్రవాహనాలను దొంగిలించి తక్కువ ధరకు అమ్మేవారు. మహేష్‌ దొంగతనాలు చేసేందుకు ఎంచుకున్న నగరాల్లో ప్రైవేటు వసతి గృహాల్లో దిగి, అక్కడ బసచేసిన వ్యక్తుల డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌, ఓటరు గుర్తింపుకార్డులు చోరీ చేస్తాడు. డ్రైవర్లు కావాలంటూ పత్రికల్లో ప్రకటనలిచ్చి, వచ్చిన వారి నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌కార్డులు సేకరిస్తాడు. వీటి ద్వారా కార్లు, ద్విచక్రవాహనాలను యాప్‌ల నుంచి అద్దెకు తీసుకుంటాడు. నకిలీ నంబరు ప్లేట్లను అమర్చుతాడు. సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్‌లో అతి తక్కువ ధరకు విక్రయిస్తాడు. ఇప్పటి వరకూ 26 కార్లను దొంగిలించాడని దర్యాప్తులో గుర్తించారు. గతేడాది జైలు నుంచి విడుదలయ్యాక ఇదే పద్ధతిలో యాప్స్‌ ద్వారా అద్దెకు తీసుకున్న వాహనాలను అమ్మి సొమ్ము చేసుకున్నాడు. జూమ్‌కార్స్‌ నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేయగా.. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా కూపీ లాగారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను అరెస్ట్‌ చేశారని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు.

Also Read: Andhra Pradesh: సాధారణ వాహన తనిఖీలు.. కంగారుగా యువకుడు.. ఎంక్వైరీ చేయగా దిమ్మతిరిగే ట్విస్ట్