Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సాధారణ వాహన తనిఖీలు.. కంగారుగా యువకుడు.. ఎంక్వైరీ చేయగా దిమ్మతిరిగే ట్విస్ట్

అనంతపురం జిల్లాలో పోలీసులు చేపట్టిన సాధారణ తనిఖీల్లో షాకింగ్ విషయం బయటపడింది. గంజాయి లేదా ఎర్ర చందనం లేదా ఇంకా ఏదైనా స్మగ్లింగ్ చేస్తున్నారని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.

Andhra Pradesh: సాధారణ వాహన తనిఖీలు.. కంగారుగా యువకుడు.. ఎంక్వైరీ చేయగా దిమ్మతిరిగే ట్విస్ట్
Ap Crime News
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 11, 2022 | 8:12 AM

Anantapur district: అతడి టార్గెట్ మహిళలు, వృద్ధులే. అలాగని వారిపై దాడులు చేయడు. ఏమార్చి మాయ చేస్తాడు. సాధారణ వాహన తనిఖీల్లో ఈ కేటుగాడి అసలు బాగోతం వెలుగుచూసింది. ఇంతకీ అతడు చేస్తున్న క్రైమ్ ఏంటి అంటే. నకిలీ కరెన్సీ నోట్లు(fake currency notes) చలామణి. అవును ఈ యాంగిల్ మీరు ఊహించి ఉండరు. పోలీసులు కూడా అంతే షాక్ అయ్యారు. ఊహించని విధంగా పోలీసులకు చిక్కాడు ఈ ఫేక్ కరెన్సీ మాయగాడు.  అనంతపురం జిల్లా కదిరి(Kadiri)లో సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తోన్న పోలీసులకు ఓ యువకుడి ప్రవర్తనపై కాస్త అనుమానం కలిగింది. అతడు కంగారుగా కనిపించడంతో..  వాహన రికార్డులను చెక్ చేశారు. అతడు పర్సులో ఉన్న బైక్ డాక్యుమెంట్స్ చూపిస్తుండగా.. అతని వద్ద ఉన్న నగదుపై అనుమానం కలిగింది. వెంటనే ఉన్నతాధికారుల విషయం చెప్పారు. యువకుడి వద్ద ఉన్న రూ.200, రూ.100నోట్లపై డౌట్ రావడంతో.. అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. నిందితుడిని తనకల్లు మండలం చెక్కవారిపల్లికి చెందిన ముద్దల చిన్నబాబు అలియాస్ జాన్‌గా గుర్తించారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా ఫేక్ నోట్స్ వ్యవహారం వెలుగుచూసింది.

నిందితుడు ఫ్రింటర్ సాయంతో రూ.200,రూ.100 నోట్లను జిరాక్స్ తీసుకుని వాటిని సర్కులేట్ చేస్తున్నట్లు అంగీకరించారు. నిందితుడి నుంచి రూ.17,100 ఫేక్ నోట్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ భవ్యకిషోర్ వెల్లడించారు. అతని నుంచి నకిలీనోట్లతోపాటు ప్రింటర్​ను స్వాధీనం చేసుకున్నారు. రూ.500నోట్ల విషయంలో మాత్రమే కాదు.. రూ.100, రూ.200 నోట్ల విషయంలో జాగ్రత్త అవసరమే అని ఈ ఇన్సిడెంట్ చెప్పకనే చెబుతుంది.

Also Read: Andhra Pradesh: బస్సులో ప్రయాణిస్తున్న పెళ్లి బృందం.. పోలీసులు ఆపగానే అందరూ ఎస్కేప్.. ఎంక్వైరీ చేయగా