Andhra Pradesh: బస్సులో ప్రయాణిస్తున్న పెళ్లి బృందం.. పోలీసులు ఆపగానే అందరూ ఎస్కేప్.. ఎంక్వైరీ చేయగా…

AP Crime News: విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో ఎర్రచందనాన్ని స్మగర్స్ అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులకు దొరికి.. జైలు శిక్ష అనుభవించాక కూడా కొందరు.. మళ్లీ అదే తప్పు చేస్తున్నారు.

Andhra Pradesh: బస్సులో ప్రయాణిస్తున్న పెళ్లి బృందం.. పోలీసులు ఆపగానే అందరూ ఎస్కేప్.. ఎంక్వైరీ చేయగా...
Ap Crime News
Follow us

|

Updated on: Feb 10, 2022 | 2:05 PM

Chittoor District: ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం ఎక్కువగా శేషాచలం కొండల్లో(Seshachalam Hills)మాత్రమే దొరకుతుంది. ఇక్కడ దొరికే ఎర్రచందనంలో ఎక్కువ చావ ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది.  విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో ఎర్రచందనాన్ని స్మగర్స్ అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులకు దొరికి.. జైలు శిక్ష అనుభవించాక కూడా కొందరు.. మళ్లీ అదే తప్పు చేస్తున్నారంటే వారికి ఎర్ర బంగారం ఎంత కాసులు కురిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కొందరు అయితే ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయడానికి ప్రాణాలకు తెగిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. పెళ్లి బృందం మాదిరి బస్సులో తమిళనాడు నుంచి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. అయితే వీళ్ల వాలకం తేడా కొట్టడంతో బైపాస్ రోడ్డులో మన పోలీసులు బస్సునుఆపారు.. దీంతో వెంటనే అలర్టైన కూలీలు.. వెంటనే బస్సు దిగి పరారయ్యారు. పారిపోయినవారు 30 నుంచి 40 మంది ఉంటారని తెలుస్తోంది. బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమిళనాడు(Tamil Nadu)కు చెందిన ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి తమిళనాడులోని తిరువత్తూరుకు వెళుతున్నట్లు తెలిసింది. బస్సు డ్రైవర్, కండెక్టర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారికి విచారిస్తున్నారు.

ఇటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది.. ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా.. అరుదైన ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. స్మగ్లర్లు పోలీసుల కళ్లు గప్పి మన సందను దోచుకెళ్లుపోతున్నారు. రోజూ పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో ఎర్రచందనం దుంగలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇక తప్పించుకుని ఎంతమంది చెక్కేస్తున్నారో ఆ తిరుమల వెంకన్నకే తెలియాలి.

Also Read:  CM Jagan: ఏపీ సీఎం జగన్‌ సీరియస్‌.. అతి చేసినవారికి అక్షింతలు.. పునరావృతం కావొద్దని ఆదేశం