CM Jagan-Tollywood: రోజంతా 5షోలకు పర్మిషన్..! పరస్పర ప్రయోజనాలు.. సారాంశం ఇదే

Telugu Film Industry: పరస్పర ప్రయోజనాలు. అటు ఏపీకి ఉండాలి.. ఇటు తెలుగు సినీ పరిశ్రమకూ ఉండాలి. జగన్‌తో మీటింగ్ తర్వాత సినీ పెద్దలు, మంత్రి వెల్లడించిన అభిప్రాయాలతో ఇదే సారాంశం కనిపిస్తోంది.

CM Jagan-Tollywood: రోజంతా 5షోలకు పర్మిషన్..! పరస్పర ప్రయోజనాలు.. సారాంశం ఇదే
Tollywood
Follow us
Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: Feb 10, 2022 | 5:12 PM

Andhra Pradesh: పరస్పర ప్రయోజనాలు. అటు ఏపీకి ఉండాలి.. ఇటు తెలుగు సినీ పరిశ్రమకూ ఉండాలి. జగన్‌తో మీటింగ్ తర్వాత సినీ పెద్దలు, మంత్రి వెల్లడించిన అభిప్రాయాలతో ఇదే సారాంశం కనిపిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ బతకడానికి ప్రభుత్వం సహకరించాలి. ఆ సహకారం ఎన్ని రకాలుగా ఉండాలన్నదానిపై మొత్తం 17 రకాల అజెండాతో సినీ ప్రముఖులు వెళ్లారు. దానిపై చర్చలు జరిగాయి. ప్రభుత్వం నుంచీ సానుకూల సంకేతాలు వచ్చాయి. అలాగే ప్రభుత్వం కూడా సినీ ప్రముఖుల ముందు కొన్ని కోరికలు ఉంచింది. ఏపీలో సినిమా పరిశ్రమ పెట్టాలి. విశాఖ సహా అవకాశం ఉన్న చోట్ల ఏపీలో షూటింగ్‌లు ఎక్కువగా జరగాలి. అందుకు సినీ ప్రముఖులు కూడా సానుకూలంగా స్పందించారు.

ప్రతీ థియేటర్‌లో ఉదయం 8 నుంచి మొదలై.. రోజంతా 5షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇన్నాళ్లూ తెగకుండా, ముడిపడకుండా ఉన్న టికెట్ రేట్లపైనా ఓ సానుకూల చర్చే జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ 5రూపాయలు టికెట్‌ ఉన్న నాన్‌ఏసీ థియేటర్‌లో ఇకపై మినిమమ్‌ 30 రూపాయలు, అత్యధికంగా 70 రూపాయలు ఉండేలా కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక నగర పంచాయతీ అయినా, మున్సిపాలిటీ అయినా,కార్పొరేషన్ అయినా.. మినిమమ్‌ టికెట్ రేట్ 40, మ్యాగ్జిమమ్ 150 రూపాయల వరకూ ఆస్కారం ఉండబోతోంది. రాబోయే 2 వారాల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కూడా అధికారిక ఉత్తర్వులు వచ్చే చాన్స్ ఉంది.

ఏపీలో సినీ పరిశ్రమ పెడితే ఎలాంటి ప్రోత్సహకాలు కావాలో సినీ ప్రముఖులు అడిగారు. సీఎం జగన్‌ వైపు నుంచి కూడా పరిశ్రమకు తగ్గ రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాన్న సానుకూలత కనిపించింది.

Also Read: Andhra Pradesh: బస్సులో ప్రయాణిస్తున్న పెళ్లి బృందం.. పోలీసులు ఆపగానే అందరూ ఎస్కేప్.. ఎంక్వైరీ చేయగా…

CM Jagan: ఏపీ సీఎం జగన్‌ సీరియస్‌.. అతి చేసినవారికి అక్షింతలు.. పునరావృతం కావొద్దని ఆదేశం

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?