AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఏపీ సీఎం జగన్‌ సీరియస్‌.. అతి చేసినవారికి అక్షింతలు.. పునరావృతం కావొద్దని ఆదేశం

AP News: తన పర్యటన సందర్భంగా విశాఖలో గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపేశారని సీఎం జగన్ ప్రశ్నించారు. ఇలా ప్రవర్తించడం మానేయాలని సూచించారు.

CM Jagan: ఏపీ సీఎం జగన్‌ సీరియస్‌.. అతి చేసినవారికి అక్షింతలు.. పునరావృతం కావొద్దని ఆదేశం
Cm Jagan
Ram Naramaneni
|

Updated on: Feb 10, 2022 | 11:15 AM

Share

AP Cm Vizag Tour: ఏపీ సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యారు. బుధవారం విశాఖ టూర్‌ సందర్భంగా గంటల తరబడి ట్రాఫిక్‌ ఆంక్షలపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి అధికారులు, పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి ట్రాఫిక్‌ ఎందుకు నిలిపివేశారని అధికారులను ప్రశ్నించారు సీఎం. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేశారని సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నానని సీఎం జగన్‌ తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ పర్యటన ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేసినట్లు వార్తలొచ్చాయి. మూడు గంటల పాటు ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని నగర ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులతో పలుచోట్ల గొడవ పెట్టకున్నారు. హారన్లు మోగిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సినవాళ్లు, ఆస్పత్రులకు వెళ్లాల్సినవారు ఇబ్బందులు పడ్డారు. ద్విచక్రవాహనదారులు మండుటెండలోనే గంటల తరబడి ఉండాల్సి వచ్చింది.

సీఎం జగన్‌ బుధవారం విశాఖ శారదా పీఠం వార్షిక వార్షికోత్సవాలకు హాజరుకావడానికి షెడ్యూలు ప్రకారం ఉదయం 11 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాల్సి ఉండగా 11.45కు వచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు తిరిగి బయల్దేరాలింది.. కానీ వివిధ కార్యక్రమాల వల్ల సాయంత్రం 4 వరకు అక్కడే ఉన్నారు. అలాగే, సీఎం జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో పోలీసుల అతి వల్ల సామాన్యలు ఇబ్బందలు ఎదుర్కొనడంపై నారా లోకేష్ సైతం భగ్గుమన్నారు. ‘సీఎం ప్రైవేటు పర్యటన కోసం శారదాపీఠం వెళ్తే, విశాఖ ప్రజలు ఇబ్బంది పడాలా ?’ అని ప్రశ్నించారు. విమర్శలు రావడంతో సీఎం జగన్ స్పందించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Andhra Pradesh: మొక్కజొన్న లోడ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. అసలు విషయం తెలిస్తే మతి పోతుంది

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!