CM Jagan-Tollywood: ఎయిర్‌పోర్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్.. సీఎంతో మీటింగ్‌కు తారక్ దూరం

Tollywood: ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య వివాదం ముదరడానికి కారణం జీవో నెంబర్ 35. అది సినిమా టికెట్ల రేట్లపై నిర్దేశించిన జీవో. ఈ ఉత్తర్వులో చెప్పిన ప్రకారం సినిమాలు ఆడించడం కష్టమన్నది థియేటర్ల వాదన.

CM Jagan-Tollywood: ఎయిర్‌పోర్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్.. సీఎంతో మీటింగ్‌కు తారక్ దూరం
Jr Ntr Chiru
Follow us
Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: Feb 10, 2022 | 5:13 PM

మరి కాసేపట్లో టాలీవుడ్ పెద్దల ఫ్లైట్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుంది. మొత్తం 17 అంశాల అజెండాతో సీఎం జగన్‌తో సినీ పెద్దల మీటింగ్ ఉంటుందన్నది సమాచారం. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరనుంది టాలీవుడ్‌ బృందం. చిరంజీవితోపాటు మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి వెళ్తున్నారు. ఇక నటుడు అలీ, పోసాని కృష్ణమురళీ, ఆర్ నారాయణ మూర్తి ఇప్పటికే విజయవాడ చేరకున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ కూడా ఏపీ వెళ్తారని ప్రచారం జరిగినా.. ఆయన సీఎంను కలిసేందుకు వెళ్లడం లేదన్నది తాజా అప్‌డేట్. ఇక ఏపీ వెళ్లేందుకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌ వచ్చిన చిరంజీవి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు సీఎంఓ నుంచి ఆహ్వానం అందిందని… మిగతా ఎవరు వస్తారో తెలీదు చూద్దాం అంటూ ట్విస్ట్ ఇచ్చారు. కాగా ఈ రోజుతో సమస్యలకు ఎండ్ కార్డు కాదు శుభం కార్డు పడుతందన్నారు. అన్ని సమస్యలకు ఇవాళ్టితో ఎండ్‌ కార్డ్‌ పడుతుంది అన్నారు అల్లు అరవింద్. ఇండస్ట్రీకి మేలు జరిగే ప్రకటన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫ్యామిలీ నుంచి చిరంజీవి ఏపీ వెళ్తున్నట్లు చెప్పారు.

ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య వివాదం ముదరడానికి కారణం జీవో నెంబర్ 35. అది సినిమా టికెట్ల రేట్లపై నిర్దేశించిన జీవో. ఈ ఉత్తర్వులో చెప్పిన ప్రకారం సినిమాలు ఆడించడం కష్టమన్నది థియేటర్ల వాదన. భారీ బడ్జెట్‌తో సినిమాలు, ప్యాన్ ఇండియా మూవీస్‌తో ఇండస్ట్రీనికి దేశానికే కేరాఫ్‌గా మార్చిన నిర్మాతలకూ ఈ రేట్లతో పెద్దగా లాభం లేదంటూ చెబుతూ వచ్చారు. ఓవైపు కొన్ని థియేటర్లు స్వచ్చందంగా మూస్తే, ఇంకొన్ని థియేటర్స్‌ రూల్స్ పాటించడంలేదని అధికారులు క్లోజ్ చేశారు. ఈ గొడవల మధ్యలోనే అఖండ, పుష్ప, శ్యామ్‌సింగారాయ్‌, బంగార్రాజు లాంటి బిగ్ మూవీస్‌ కూడా విడుదలై ఇప్పుడు OTTలోనూ స్ట్రీమ్ అవుతున్నాయి. కారణాలు ఏవైనా ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన పెద్ద అన్నీ వాయిదా పడ్డాయి. RRR, రాధేశ్యామ్‌, ఆచార్య, భీమ్లానాయక్ కూడా పోస్ట్‌పోన్‌ లిస్ట్‌లో ఉన్నాయి.

ఇప్పడు సీఎం జగన్‌తో మీటింగ్ తర్వాత సమస్యలు పరిష్కారం అయితే వరసబెట్టి ప్యాన్ ఇండియా మూవీస్‌ థియేటర్‌లోకి వచ్చేస్తాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read: Andhra Pradesh: మొక్కజొన్న లోడ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. అసలు విషయం తెలిస్తే మతి పోతుంది