Tollywood: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయిన సినీ పెద్దలు..
సినిమా టికెట్ల రేట్లు, ఏపీలో పరిశ్రమ అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ తో చర్చించేందుకు విజయవాడ చేరుకున్నారు టాలీవుడ్ పెద్దలు
Tollywood: సినిమా టికెట్ల రేట్లు, ఏపీలో పరిశ్రమ అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ తో చర్చించేందుకు విజయవాడ చేరుకున్నారు టాలీవుడ్ పెద్దలు. ఇప్పటికే టికెట్ రేట్లపై పలు ప్రతిపాదనలు సిద్దం చేసింది కమిటీ. పరిశ్రమకు సంబంధించి 17 అంశాలను సినీపెద్దలు సీఎం జగన్ ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. టికెట్ ధరలు, పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు టాలీవుడ్ బృందం అనంతరం అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. చిరంజీవితోపాటు మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, పోసాని, కొరటాల శివ, నటుడు అలీ, నారాయణ మూర్తి జగన్ తో భేటీ అయ్యారు.
ఎక్కువమందికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సినీ పెద్దలు కోరగా..కోవిడ్ కారణంగా తక్కువ మందే రావాలని మంత్రి పేర్నినాని సూచించారు. మొత్తం 17 అంశాల అజెండాతో సీఎం జగన్‌తో సినీ పెద్దల మీటింగ్ ఉంటుందన్నది సమాచారం. ఇప్పటి వరకూ ఉన్న లెక్క ప్రకారం సమస్య ముదిరింది జీవో నెంబర్ 35తో. అది సినిమా టికెట్ల రేట్లపై నిర్దేశించిన జీవో. ఈ ఉత్తర్వులో చెప్పిన ప్రకారం సినిమాలు ఆడించడం కష్టమన్నది థియేటర్ల వాదన. భారీ బడ్జెట్‌తో సినిమాలు, ప్యాన్ ఇండియా మూవీస్‌తో ఇండస్ట్రీనికి దేశానికే కేరాఫ్‌గా మార్చిన నిర్మాతలకూ ఈ రేట్లతో పెద్దగా లాభం లేదంటూ చెబుతూ వచ్చారు. ఓవైపు కొన్ని థియేటర్లు స్వచ్చందంగా మూస్తే, ఇంకొన్ని థియేటర్స్ రూల్స్ పాటించడంలేదని అధికారులు క్లోజ్ చేశారు. ఈ గొడవల మధ్యలోనే అఖండ, పుష్ప, శ్యామ్‌సింగారాయ్, బంగార్రాజు లాంటి బిగ్ మూవీస్ కూడా విడుదలై ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమ్ అవుతున్నాయి. కారణాలు ఏవైనా ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన పెద్ద అన్నీ వాయిదా పడ్డాయి. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఆచార్య, భీమ్లానాయక్ కూడా పోస్ట్‌పోన్ లిస్ట్‌లో ఉన్నాయి. ఇప్పడు సీఎం జగన్‌తో మీటింగ్ తర్వాత సమస్యలు పరిష్కారం అయితే వరసబెట్టి ప్యాన్ ఇండియా మూవీస్ థియేటర్‌లోకి వచ్చేస్తాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :