AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadavallu Meeku Johaarlu: భారీ ధరకు శర్వానంద్ సినిమా థియేట్రికల్ రైట్స్.. కుర్రహీరో కెరీర్‌లోనే అతిపెద్ద డీల్

టాలీవుడ్ లో కుర్ర హీరోల జోరు ఏమాత్రం తగ్గడంలేదు. హిట్లు ఫ్లాప్ లతోసంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు యంగ్ హీరోస్..

Aadavallu Meeku Johaarlu: భారీ ధరకు శర్వానంద్ సినిమా థియేట్రికల్ రైట్స్.. కుర్రహీరో కెరీర్‌లోనే అతిపెద్ద డీల్
Adavallu Meeku Joharlu
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 10, 2022 | 8:01 AM

Aadavallu Meeku Johaarlu: టాలీవుడ్ లో కుర్ర హీరోల జోరు ఏమాత్రం తగ్గడంలేదు. హిట్లు ఫ్లాప్ లతోసంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు యంగ్ హీరోస్.. ఈ లిస్ట్ లో మొదటి వరుసలో ఉంటారు శర్వానంద్(Sharwanand). మొదటి నుంచి శర్వానంద్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమా చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. గత కొంత కాలంగా శర్వా నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నాయి. శర్వా సాలిడ్ హిట్ అందుకొని చాలా కాలమే అయ్యింది.. అప్పుడప్పుడే మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు సినిమాతో హిట్ అందుకున్న శర్వా.. ఆ తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని తిరిగి అందుకోలేకపోయాడు. మళ్లీ ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు శర్వా.. ఈ క్రమంలోనే ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈసారి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రానున్నాడు శర్వా.

ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తిరుమల కిషోర్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో శర్వానంద్ కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, రీసెంట్ గా వచ్చిన ఆడాళ్ళు మీకు జోహార్లు అనే పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్  దాదాపు 25 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అలాగే డిజిటల్ – శాటిలైట్ రైట్స్ సోనీ లివ్ సంస్థ కొనుగోలు చేసిందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ ఆడియో హక్కులను లహరి మ్యూజిక్ దక్కించుకుంది. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాన్ని ఫిబ్రవరి 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ఖుష్బు – రాధిక శరత్ కుమార్ – ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Priyamani: కొంటె చూపులతో కవ్విస్తున్న కాటుకళ్ల చిన్నది.. ప్రియమణి లేటెస్ట్ ఇమేజెస్

Ashu Reddy: మైండ్ బ్లాక్ అందాలతో మాయ చేస్తున్న అషు లేటెస్ట్ పిక్స్

Alia Bhatt: అందాల ఆలియా పరువాలు చూడతరమా.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్