Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UnstoppableWith NBK: మెగాస్టార్‌ ఎపిసోడ్‌ ఉండుంటే అన్‌స్టాపబుల్‌ మరో లెవెల్లో ఉండేది.. టాక్‌ షో డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన ఛాట్ షో 'అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే (Unstoppable with NBK)'.

UnstoppableWith NBK: మెగాస్టార్‌ ఎపిసోడ్‌ ఉండుంటే అన్‌స్టాపబుల్‌ మరో లెవెల్లో ఉండేది.. టాక్‌ షో డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
Unstoppable
Follow us
Basha Shek

|

Updated on: Feb 10, 2022 | 9:29 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన ఛాట్ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే (Unstoppable with NBK)’. ఇప్పటివరకు సిల్వర్‌ స్ర్కీన్‌పై తనదైన నటనతో మెప్పించిన బాలయ్య ఈ షో ద్వారా తన అభిమానులను మరింత చేరువయ్యారు. తన మ్యానరిజం, డైలాగ్స్‌, సెన్స్‌ ఆఫ్ హ్యూమర్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను సరదాగా ఇంటర్వ్యూ చేసే విధానం అందరనీ మెప్పించింది. ఈక్రమంలోనే IMDBలోని టాప్ -10 రియాలిటీ షో జాబితాలో స్థానం సంపాదించడంతో పాటు ఓటీటీ చరిత్రలోనే మోస్ట్‌ వాచ్డ్‌ షో గా’అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే’ గుర్తింపు తెచ్చుకుంది. కాగా 11 ఎపిసోడ్లతో ఇప్పటికే మొదటి సీజన్‌ను పూర్తి చేసుకుందీ సెలబ్రిటీ టాక్‌ షో. మోహన్‌ బాబు, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్, రాజమౌళి, విజయ్‌ దేవరకొండ, నాని, రానా తదితర హీరోలు వచ్చి తమ వృత్తి, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. అయితే ఈ టాక్‌ షోకు ఒక్క మెగా హీరో కూడా హాజరుకాలేదు. ఈ క్రమంలోఈ ఛాట్‌షోకు రైటర్‌గాగా వ్యవహరించిన డైరెక్టర్‌ బీవీఎస్‌ రవి (BVS Ravi) అన్‌స్టాపబుల్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ షో మొదటి సీజన్‌లో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)  తో ఓ ఎపిసోడ్‌ ప్లాన్‌ చేశామని, అయితే అనివార్య కారణాల వల్ల కుదరలేదని చెప్పుకొచ్చాడు.

అందుకే మెగా ఎపిసోడ్ సాధ్యపడలేదు..!

‘గతేడాది అక్టోబర్‌ 27న అన్‌స్టాపబుల్‌ మొదటి ఎపిసోడ్‌ షూట్‌ చేశాం. నవంబర్‌ 3న బాలయ్య భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. దీంతో కొన్ని వారాల పాటు షూటింగ్ జరగలేదు. అదే సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి వరుసగా మూడు సినిమాలకు కమిట్‌ అయ్యారు. దీంతో ఆయన డేట్లు దొరకడం కష్టమైపోయాయి. ఈ కారణంగానే బాలయ్య- మెగాస్టార్‌ ఎపిసోడ్ ఆలోచనను విరమించుకున్నాం. అయితే చిరంజీవితో బాలయ్య ఎపిసోడ్ ఉండుంటే మాత్రం అన్‌స్టాపబుల్‌ మరో లెవెల్లో ఉండేది. రెండో సీజన్‌లో అయినా మెగాస్టార్‌తో ఎపిసోడ్‌ ప్లాన్‌ చేస్తాం’ అని రవి చెప్పుకొచ్చారు. కాగా మొదటి సీజన్‌ సక్సెస్‌ఫుల్‌ కావడంతో రెండో సీజన్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు ఆహా నిర్వాహకులు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

Also Read:Pushpa: పుష్పరాజ్‌గా మారేందుకు బన్నీ ఎంత కష్టపడ్డాడో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

Akkineni Sumanth: వాల్తేర్‌ శీనుగా అక్కినేని హీరో.. అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌..

Aa Ammayi Gurinchi Meeku Cheppali: సుధీర్ బాబు సినిమా నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న పాట