AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable NBK: బాలయ్య తనపై వచ్చే మీమ్స్‌ చూసి ఏమనుకుంటారు.? నెట్టింట వైరల్‌ అవుతోన్న ‘ఆహా’ వీడియో..

Unstoppable NBK: నట సింహం బాలకృష్ణలోని మరో కోణాన్ని పరిచయం చేసింది 'అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే'. తొలి తెలుగు ఓటీటీ 'ఆహా' వేదికగా ప్రసారమైన ఈ టాక్‌ షో అందరి దృష్టిని ఆకర్షించింది. ఓటీటీ వేదికగా అత్యంత ప్రజాదరణ పొందిన టాక్‌ షోగా..

Unstoppable NBK: బాలయ్య తనపై వచ్చే మీమ్స్‌ చూసి ఏమనుకుంటారు.? నెట్టింట వైరల్‌ అవుతోన్న 'ఆహా' వీడియో..
Balakrishna
Narender Vaitla
|

Updated on: Feb 10, 2022 | 8:02 PM

Share

Unstoppable NBK: నట సింహం బాలకృష్ణలోని మరో కోణాన్ని పరిచయం చేసింది ‘అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే’. తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా ప్రసారమైన ఈ టాక్‌ షో అందరి దృష్టిని ఆకర్షించింది. ఓటీటీ వేదికగా అత్యంత ప్రజాదరణ పొందిన టాక్‌ షోగా రికార్డు సాధించింది. మహేష్‌ బాబుతో జరిగిన ఎపిసోడ్‌తో అన్‌స్టాపబుల్‌ తొలి సీజన్‌ ముగిసిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే సెకండ్‌ సీజన్‌ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జూలై నుంచి సెకండ్‌ సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఆహా బాలకృష్ణను రాపిడ్‌ ఫైర్‌లా అడిగిన కొన్ని ప్రశ్నలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

బాలకృష్ణ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారనే విషయం తెలిసిందే. అయితే ఆయన పేరుమీద సోషల్‌ మీడియాలో మీమ్స్‌ కూడా పెద్ద ఎత్తున వైరల్‌ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా బాలకృష్ణ డైలాగ్‌లు, డ్యాన్స్‌, ఫైటింగ్‌లపై ఎత్తు మీమ్స్‌ పోస్ట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆహా నిర్వహించిన ‘నెవర్‌ హావ్‌ ఐ నెవర్‌’ (నేను ఎప్పుడు చేయనిది) షోలో భాగంగా ‘మీపై వచ్చే మీమ్స్‌ గురించి ఎప్పుడైనా నవ్వుకున్నారా.?’ అన్న ప్రశ్నకు ‘నవ్వుకున్నాను’ అని సమాధానం ఇచ్చారు.

కరోనా వచ్చిన సమయంలో లెజెండ్‌ సినిమాలోని డైలాగ్‌తో చేసిన మీమ్స్‌ చూసినప్పుడు నవ్వుకున్నాను అని తెలిపారు. ఇక ఎప్పుడైనా కాలేజికి బంక్‌ కొట్టారా అన్న ప్రశ్నకు ‘బంక్‌ కొట్టని వారు ఎవరు ఉంటారు చెప్పండి’ అంటూ బదులిచ్చారు. ఇలా పలు సరదా ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు బాలకృష్ణ. మరి బాలయ్య బాబు చెప్పిన ఇంకొన్ని ఫన్నీ విశేషాలు చూసేయండి..

Also Read: Big News Big Debate: చిరంజీవి విజ్ఞప్తులపై CM సానుకూలమేనా ?? టికెట్ల ధరల పెంపునకు లైన్‌ క్లియర్‌ అయిందా ?? లైవ్ వీడియో

Weight Loss: బరువు తగ్గాలంటే లంచ్‌లో వీటిని చేర్చండి.. ఊబకాయాన్ని ఉఫ్‌మని ఊదేస్తాయి..!

Pregnancy Care: గర్భధారణ సమయంలో బరువు తగ్గుతున్నారా? అయితే విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే..!