Malli Modalaindi Review: మళ్లీ మొదలైన సుమంత్ మ్యాజిక్.. మంచి ఫీల్ ఉన్న మూవీ..

అక్కినేని హీరో సుమంత్ హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. సుమంత్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

Malli Modalaindi Review: మళ్లీ మొదలైన సుమంత్ మ్యాజిక్.. మంచి ఫీల్ ఉన్న మూవీ..
Akkineni Sumanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 11, 2022 | 12:50 PM

సినిమా: మళ్ళీ మొదలైంది

నటీనటులు: సుమంత్‌, నైనా గంగూలీ, వర్షిణి, సుహాసినీ, వెన్నెల కిషోర్‌

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

రచన, ద‌ర్శక‌త్వం: టీజీ.కీర్తి కుమార్‌

నిర్మాత: రాజశేఖర్‌రెడ్డి;

అక్కినేని హీరో సుమంత్ హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. సుమంత్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నారు సుమంత్. మళ్ళీరావా సినిమాతో హిట్ అందుకున్న సుమంత్ మళ్లీ అలాంటి హిట్ కోసమే ఎదురుచూస్తున్నారు. తాజాగా సుమంత్ మళ్లీ మొదలైంది అనేసినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థియేటర్స్ లోకాకుండా ఓటీటీ వేదికగా ఈ మూవీ విడుదల అయ్యింది. టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా విడుదలైంది ఈ మూవీ ఎలా ఉందంటే..

కథ : 

విక్రమ్‌ (సుమంత్‌) ఒక చెఫ్‌. తనకు నచ్చిన అమ్మాయి నిషా (వర్షిణీ )ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కొన్నాళ్ళు సాఫీగా సాగిన వీరి సంసారంలోఆతర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. దాంతో విడాకులు తీసుకుంటారు. ఆ తర్వాత నిషాతో విడాకులు ఇప్పించిన లాయర్ పవిత్ర (నైనా గంగూలీ)తో ప్రేమలో పడతాడు విక్రమ్. కాకపోతే రెండోసారి పెళ్లి చేసుకోవాలంటే విక్రమ్‌కు భయం.మళ్లీ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ గొడవలై.. విడాకుల వరకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతుంటాడు. ప్రేమ విషయం తెలుసుకొని పవిత్ర అతడిని దూరం పెడుతుంది. ఆతర్వాత విక్రమ్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు .? పవిత్ర విక్రమ్ ను ప్రేమిస్తుందా..? ఇద్దరు పెళ్లి చేసుకుంటారా..? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ :

విడాకుల తర్వాత జీవితం ఎలా ఉంటుంది. ఒక మగడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అన్నది ఈ సినిమాలో చక్కగా చూపించారు దర్శకుడు. విడాకులు తీసుకున్న విక్రమ్ నిషాను  సమాజం ఏ విధంగా చూస్తుందో వివరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మరోవైపు నిషా తరఫు న్యాయవాది పవిత్రతో విక్రమ్‌ ప్రేమలో పడటం, ఆమె ప్రేమను పొందేందుకు అతడు పడే కష్టాలు ఆకట్టుకున్నాయి. ఎట్టకేలకు విక్రమ్‌ ప్రేమను పవిత్ర అంగీకరించి.. పెళ్లి చేసుకుందామని అడగడం, దానికి విక్రమ్‌ ఒప్పుకోకపోవడం వంటివి ఆసక్తి కలిగించాయి. రెండో పెళ్లి గురించి విక్రమ్ కు లాయర్ కుటుంబరావు( పోసాని) వివరించిన తీరు ప్రేక్షకుల మనసులను కదిలించాయి. విక్రమ్‌ స్నేహితుడు కిషోర్‌ పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పూయించారు. విక్రమ్‌కు, అతడి తల్లి సుజా( సుహాసిని ) మధ్య ఎమోషన్ ఆకట్టుకుంది. సుమంత్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్ నైనా గంగూలీ అందంతో నటనతో ఆకట్టుకుంది . వర్షిణి కూడా తన పాత్రకు న్యాయం చేసింది. విజువల్ పరంగా సినిమా చాలా బాగుంది. దర్శకుడు ఎంచుకున్న కథను చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు.

చివరకు : మళ్లీ మొదలైన సుమంత్ మ్యాజిక్

మరిన్ని ఇక్కడ చదవండి :

Avika Gor: చీరకట్టులో సోయగాలు వలక పోస్తున్న చిన్నారి పెళ్లి కూతురు లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Bhanu Shree: లంగా ఓణీలో తన అందాలు చూపిస్తూ ఫాన్స్‌ను మైమరిపిస్తున్న భాను శ్రీ లేటెస్ట్ ఇమేజెస్

Unstoppable NBK: బాలయ్య తనపై వచ్చే మీమ్స్‌ చూసి ఏమనుకుంటారు.? నెట్టింట వైరల్‌ అవుతోన్న ‘ఆహా’ వీడియో..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ