Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangarraju OTT: బంగార్రాజు సందడి మళ్లీ మొదలవుతుంది.. జీ5 ఓటీటీలో నాగార్జున సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

అక్కినేని నాగార్జున (akkineni nagarjuna).. నాగచైతన్య (naga chaitanya) కలిసి నటించిన లేటేస్ట్ చిత్రం బంగార్రాజు (naga chaitanya).

Bangarraju OTT: బంగార్రాజు సందడి మళ్లీ మొదలవుతుంది.. జీ5 ఓటీటీలో నాగార్జున సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Bangarraju
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 11, 2022 | 8:32 PM

అక్కినేని నాగార్జున (akkineni nagarjuna).. నాగచైతన్య (naga chaitanya) కలిసి నటించిన లేటేస్ట్ చిత్రం బంగార్రాజు (naga chaitanya). డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‏గా నిలిచింది. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా.. చైతూ సరసన కృతి శెట్టి నటించింది. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్న నాయనా చిత్రానికి సిక్వెల్‏గా బంగార్రాజు సినిమా తెరకెక్కింది. ఓవైపు కరోనా కేసులు పెరుగుతుండడంతో భారీ చిత్రాలు సైతం వాయిదా పడుతున్న తరుణంలో త‌మ సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లో వాయిదా వేసేది లేద‌ని తేల్చి చెప్పి మ‌రీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు కింగ్ నాగార్జున‌.

తాజాగా సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. బంగార్రాజు ట్రైలర్ రిలీజ్ చేశారు జీ5 మేకర్స్. లవ్.. యాక్షన్.. ఎమోషన్.. సస్పెన్స్ ఇలా కథను అన్ని వైపులా నుంచి కవర్ చేస్తూ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా మంచి వసూళ్లు రాబట్టింది.

Also Read:  Samantha: మధ్యలో చిన్న చిన్న క్షణాలు.. ఇంతకీ ఫోటోతో సమంత ఏం చెప్పాలనుకుంటుంది..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో.. మహేష్ కళావతి సాంగ్ అదుర్స్..

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ఆఖరి చిత్రం టీజర్ వచ్చేసింది.. యాక్షన్ ఎంటర్‏టైనర్‏ జేమ్స్‏గా అదరగొట్టిన అప్పు..

Ranga Ranga Vaibhavanga: అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.. వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా రిలీజ్ అయ్యేది అప్పుడే..