Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ఆఖరి చిత్రం టీజర్ వచ్చేసింది.. యాక్షన్ ఎంటర్‏టైనర్‏ జేమ్స్‏గా అదరగొట్టిన అప్పు..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) అకాల మరణం యావత్ సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచేసింది.

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ఆఖరి చిత్రం టీజర్ వచ్చేసింది.. యాక్షన్ ఎంటర్‏టైనర్‏ జేమ్స్‏గా అదరగొట్టిన అప్పు..
Puneeth
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 11, 2022 | 5:10 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) అకాల మరణం యావత్ సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచేసింది. గుండెపోటుతో పునీత్ గతేడాది అక్టోబర్ 29న మరణించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆరోగ్యంగా.. ఫిట్‏గా ఉండే పునీత్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో అభిమానులు… సినీ ప్రముఖులు షాకయ్యారు. ఇప్పటికీ పునీత్ జ్ఞాపకాలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం జేమ్స్ (James) విడుదలకు సిద్ధమయ్యింది. కాసేపటి క్రితం ఈ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్రయూనిట్.

మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో శ్రీకాంత్, శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించారు. ఈ ప్రపంచంలో మొత్తం మూడు మార్కెట్లు ఉన్నాయి. ఓపెన్ మార్కెట్, డీప్ మార్కెట్, డార్క్ మార్కెట్. ఇది వరల్డ్ మాఫియా అనే డైలాగ్స్‏తో ఈ టీజర్ మొదలైంది. గన్స్‏తో నిలబడే వందమంది కంటే.. గన్ లాంటివాడిని ఒక్కడిని వెతికి తీసుకురండి.. ఎదురు నిలబడి కాపాడడం తెలసుండాలి. ఎదురొచ్చే గుండెలో బుల్లెట్టు దింపడం తెలుసుండాలి అంటూ శ్రీకాంత్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో శ్రీకాంత్, శరత్ కుమార్ ముఖ్యపాత్రలలో నటించారు. ఈ చిత్రంలోని పునీత్ పాత్రకు ఆయన సోదరుడు శివకుమార్ ఇటీవల డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాకు చేతన్ కుమర్ దర్శకత్వం వహించగా.. కిషోర్ పత్తికొండ నిర్మించారు. తాజాగా విడుదలైన టీజర్ లో.. నాకు మొదటి నుంచి రికార్డ్స్ బ్రేక్ చేయడమే అలవాటు అంటూ పునీత్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తై.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సమయంలోనే పునీత్ ఆకస్మాత్తుగా మరణించారు. తాజాగా ఈ టీజర్‏కు విశేషమైన స్పందన వస్తోంది. ఈ సినిమాను పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు అయిన మార్చి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తోంది చిత్రయూనిట్.

Also Read: Pushpa: తగ్గేదేలే అంటున్న యుజ్వేంద్ర చాహల్.. వైరల్‌గా మారిన స్పిన్నర్ ఇన్‌స్టారీల్‌ వీడియో..

Alia Bhatt: నా పెళ్లి ఎప్పుడో అయిపొయింది.. షాక్ ఇచ్చిన అలియా భట్

Malli Modalaindi Review: మళ్లీ మొదలైన సుమంత్ మ్యాజిక్.. మంచి ఫీల్ ఉన్న మూవీ..

Kangana Ranaut: హిజాబ్ వివాదంపై కంగనా సంచలన వ్యాఖ్యలు.. మీరు ధైర్యం చూపించాలనుకంటే..

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో