Samantha: మధ్యలో చిన్న చిన్న క్షణాలు.. ఇంతకీ ఫోటోతో సమంత ఏం చెప్పాలనుకుంటుంది..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (samantha) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో తెలిసిన విషయమే. గత కొద్ది రోజులుగా సామ్ తన సోషల్ మీడియాలో

Samantha: మధ్యలో చిన్న చిన్న క్షణాలు.. ఇంతకీ ఫోటోతో సమంత ఏం చెప్పాలనుకుంటుంది..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 11, 2022 | 6:15 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (samantha) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో తెలిసిన విషయమే. గత కొద్ది రోజులుగా సామ్ తన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్స్ చేస్తూ వస్తోంది. మోటివేషనల్ కోట్స్ మాత్రమే కాకుండా.. తన లేటేస్ట్ ఫోటోస్.. టూర్ వీడియోస్.. ఇలా ప్రతి విషయాన్ని నెట్టింట్లో తన ఫాలోవర్స్‏తో పంచుకుంటుంది. సామ్ ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ బాలీవుడ్ సినిమా కోసం పూర్తిగా తన ఫిట్‍నెస్ పై దృష్టి పెట్టిందని.. ఇందుకోసం హెవీ వర్కవుట్స్ చేస్తున్నట్లుగా నెట్టింట్లో టాక్ నడుస్తోంది.

తాజాగా సమంత తన ఇన్‏స్టాలో లేటేస్ట్ ఫోటో షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ మోడ్‏లో ఉన్న ఆ ఫోటోలో సమంత ఎదో ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేస్తూ.. మధ్యలో చిన్న చిన్న క్షణాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది సామ్. సమంత షేర్ చేసిన పోస్ట్ మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. బ్యూటీఫుల్, గార్జియస్, నైస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె అభిమానులు. ఇటీవల అల్లు అర్జున్.. రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప సినిమాలో సామ్ ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సామ్ కిల్లింగ్ ఎక్స్‏ప్రెషన్స్‏కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం సామ్.. యశోద సినిమాలో నటిస్తోంది. ఇక ఇప్పటికే డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read: Pushpa: తగ్గేదేలే అంటున్న యుజ్వేంద్ర చాహల్.. వైరల్‌గా మారిన స్పిన్నర్ ఇన్‌స్టారీల్‌ వీడియో..

Alia Bhatt: నా పెళ్లి ఎప్పుడో అయిపొయింది.. షాక్ ఇచ్చిన అలియా భట్

Malli Modalaindi Review: మళ్లీ మొదలైన సుమంత్ మ్యాజిక్.. మంచి ఫీల్ ఉన్న మూవీ..

Kangana Ranaut: హిజాబ్ వివాదంపై కంగనా సంచలన వ్యాఖ్యలు.. మీరు ధైర్యం చూపించాలనుకంటే..