Priyanka Jawalkar: హీరోయిన్‌ను గూగుల్ హిస్టరీ అడిగిన నెటిజన్.. రాత్రి సెర్చ్ చేసింది ఇదేనంటూ..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల హవా నడుస్తోంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని తెలుగు చిత్రపరిశ్రమలో వరుస
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల హవా నడుస్తోంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని తెలుగు చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. అందులో ప్రియాంక జవాల్కర్ (priyanka jawalkar ) ఒకరు. టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ప్రియాంక. అందం, అభినయంతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ వెండితెరపై మెరిసింది. అయితే ప్రియాంకకు ఆఫర్లు ఎన్ని వచ్చినా.. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలు మాత్రం సూపర్ హిట్ కాలేకపోతున్నాయి.
ఈ ఏడాది తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం, గమనం వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఓవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటోంది ప్రియాంక. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్.. మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా ప్రియాంక జవాల్కర్ తన అభిమానులతో ముచ్చటించింది. అందులో ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.
అయితే ఈ క్రమంలో తన గూగుల్ హిస్టరీ చూపించమని ఎవరో అడిగారట. ఆ విషయం గురించి స్పందిస్తూ.. రాత్రి తను సెర్చ్ చేసిన వాటిని ఏకంగా స్క్రీన్ షాట్ తీసి మరీ పోస్ట్ చేసింది. అందులో ప్రియాంక నాసా, మల్టీవర్స్, టైం ట్రావెల్, పారలల్, యూనివర్స్ వర్సెస్ మల్టీవర్స్, జీమెయిల్, అనురాగ్ కశ్యప్ ఇలా రకరకాలుగా సెర్చ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎవరో అడిగారు.. కానీ ఎందుకు అడిగారు అంటూ ప్రియాంక తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.
View this post on Instagram
Also Read: Samantha: మధ్యలో చిన్న చిన్న క్షణాలు.. ఇంతకీ ఫోటోతో సమంత ఏం చెప్పాలనుకుంటుంది..
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో.. మహేష్ కళావతి సాంగ్ అదుర్స్..