Weight Loss: బరువు తగ్గాలంటే లంచ్‌లో వీటిని చేర్చండి.. ఊబకాయాన్ని ఉఫ్‌మని ఊదేస్తాయి..!
Health Tips: ఫిట్‌గా ఉండటమే పెద్ద సవాలు. అందుకోసం ఆహారాంలో కీలక మార్పలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో ఎలాంటివి చేర్చాలో ఇప్పుడు తెలుసుకుదాం.
Weight Loss: నేటి బిజీలైఫ్‌లో ఫిట్(Fitness)గా ఉండటమే పెద్ద సవాలుగా మారింది. భారతదేశంలో కరోనా మహమ్మారి కారణంగా, చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. తిండిపై సరైన శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. హడావిడిగా బయటి వస్తువులను తింటున్నారు. ఈ కారణాల వల్ల బరువు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. అదే సమయంలో తరచుగా ఉదయం, రాత్రి భోజనంలో డైట్ ప్లాన్‌ను అనుసరిస్తుంటారు. దీని సహాయంతో బరువును తగ్గించుకోవచ్చని నమ్ముతుంటారు. కానీ, మధ్యాహ్నం లేదా లంచ్‌లో సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల మీ డైట్ ప్లాన్(Diet Plan) మొత్తం పాడైపోతుంది. భోజనం మీ ప్రధాన ఆహారంలో భాగం. ఇలాంటి పరిస్థితిలో, మీరు మధ్యాహ్న భోజనంలో ప్రోటీన్, కేలరీలు, ఫైబర్ వంటి వాటిని చేర్చాలి. తద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. ఇక్కడ కొన్ని విషయాల గురించి చెప్పుకుందాం. మధ్యాహ్న భోజనంలో వీటిని తీసుకుంటే బరువు తగ్గవచ్చు.
బరువు తగ్గాలంటే మధ్యాహ్న భోజనంలో ఇవి తినండి..
కూరగాయలు – మన భారతీయ వంటకాల్లో కూరగాయలు ప్రధానమైనవి. కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరం సహజంగా సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అలాగే మధ్యాహ్న భోజనంలో ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఏ పుష్కలంగా అందుతాయి. దీని వినియోగం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
పప్పు – పప్పులను తీసుకోవడం ద్వారా మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఇది పూర్తిగా నిజం. కందిపప్పులో ప్రొటీన్, ఐరన్, జింక్ పుష్కలంగా లభిస్తాయి.శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు కూడా శెనగలు సహకరిస్తాయి. దీని కోసం, మీరు ప్రతిరోజూ వివిధ పప్పులను తినవచ్చు.
పెరుగు – మీరు మధ్యాహ్న భోజనంలో పెరుగు తీసుకోవచ్చు. ఆహారం జీర్ణం కావడానికి, రుచిని మెరుగుపరచడానికి పెరుగు కూడా తీసుకోవాలి. పెరుగుతో పాటు రైతా కూడా తీసుకోవచ్చు.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులను కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచింది.
Diabetes: మధుమేహం వెంటాడుతోందా..? ఈ ఆహార పదార్థాలను తీసుకోండి.. అదుపులో ఉంచుకోవచ్చు