Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ చిన్నపాటి చిట్కాలు పాటించారంటే రక్తంలో హిమోగ్లోబిన్ అమాంతంగా పెరుగుతుంది! రోజు పరగడుపున..

పోషకాల లోపం ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనేక మందిలో హిమోగ్లోబిన్ (hemoglobin) స్థాయిలు పడిపోవడం తరచుగా జరుగుతోంది..

Health Tips: ఈ చిన్నపాటి చిట్కాలు పాటించారంటే రక్తంలో హిమోగ్లోబిన్ అమాంతంగా పెరుగుతుంది! రోజు పరగడుపున..
Health Tips
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 10, 2022 | 7:22 PM

How to Increase Haemoglobin: పోషకాల లోపం ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనేక మందిలో హిమోగ్లోబిన్ (hemoglobin) స్థాయిలు పడిపోవడం తరచుగా జరుగుతోంది. ఎర్ర రక్త కణాల (red blood cells)లో కనిపించే ఐరన్-రిచ్ ప్రోటీన్‌ పై హిమోగ్లోబిన్ స్థాయి ఆధారపడి ఉంటుంది. ఇది శరీరం అంతటా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి, జీవక్రియ కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు రక్తహీనత సమస్య తలెత్తుతుంది. ఇది శరీరంలో తగినంతగా ఐరన్‌ లేకపోవడం వల్ల సంభవిస్తుంది. ఐతే ఈ సమస్యతో బాధపడేవారు రోజువారి జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేయడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. ఇంట్లోనే సహజంగా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుకోవడానికి కొన్ని చిట్కాలు మీకోసం..

ఆహారంపై శ్రద్ధ అవసరం.. హిమోగ్లోబిన్ లోపం ఉన్నవారు ఐరన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఇనుము ఒక ముఖ్యమైన ఖనిజం. ఐరన్ పుష్కలంగా ఆహారాలు అంటే.. ఆకుపచ్చ ఆకు కూరలు, టమోటాలు, గుడ్లు, చికెన్, సీఫుడ్, ఖర్జూరం, బాదం, బీన్స్, తృణధాన్యాలు, పెరుగు, విత్తనాలు అధికంగా తీసుకోవాలి. అలాగే విటమిన్ సి కోసం నారింజ, నిమ్మకాయలు, బ్రోకోలి, ద్రాక్ష, టమోటా, బొప్పాయి వంటివి తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఆహారాలలో బచ్చలికూర, వేరుశెనగ, కిడ్నీ బీన్స్, అవకాడో, పాలకూర మొదలైన వాటిని ఆహారంలో చేర్చాలి.

హెర్బల్ టీలు.. కొన్ని హెర్బల్ టీలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డాండెలైన్, ఎరుపు కోరిందకాయ ఆకుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఐరన్‌తోపాటు ఏ, సీ, కేవిటమిన్లు, కాల్షియం, పొటాషియం వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఈ హెర్బల్ టీలను రోజూ తీసుకోవడం వల్ల మీ శరీరంలోని నరాల ఆరోగ్యానికేకాకుండా ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. దీనివల్ల మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

రాగి పాత్రలోని నీరు తాగడం.. రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. నిజానికిది ప్రాచీన ఆయుర్వేద పద్ధతుల్లో ఒకటి. ఈ నీరు తగడం వల్ల ఐరన్ స్థాయి పెరుగుతుంది. జీర్ణక్రియను ప్రోత్సహించడంలో, జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. రాగి సీసా లేదా జగ్‌లో నీటిని నింపి రాత్రంతా ఉంచి.. ఉదయం పూట పొరగడుపున తగితే ఫలితముంటుంది.

ఐరన్ బ్లాకింగ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి కొన్ని రకాల ఆహారాలు ఐరన్ శోషణను తగ్గిస్తాయి. పాలు, చీజ్ వంటి పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. టీ, సోడా, కాఫీ లేదా ఆల్కహాల్‌కు కూడా దూరంగా ఉండాలి. హిమోగ్లోబిన్ తగినంతగా పెరగాలంటే గ్లూటెన్ ఆధారిత ఉత్పత్తులను తినడం కూడా తగ్గించాలి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులను కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచింది.

Also Read:

AWES Recruitment 2022 : టీజీటీ, పీజీటీ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే..