AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White Rice Side Effects: రోజూ వైట్ రైస్ తింటున్నారా? మీరు ప్రమాదంలో పడినట్లే.. ఈ విషయాలు తెలుసుకోండి!

దక్షిణ భారతంలో ఎక్కువ శాతం ఇళ్లలో వరి అన్నం పరిపాటి. ఏది తిన్నా ఒక్క ముద్దైనా అన్నం తినకపోతే ఆ పూటకి భోజనం చెయ్యనట్టే భావిస్తారు. రోజూ తెల్ల బియ్యం తింటే..

White Rice Side Effects: రోజూ వైట్ రైస్ తింటున్నారా? మీరు ప్రమాదంలో పడినట్లే.. ఈ విషయాలు తెలుసుకోండి!
White Rice
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 10, 2022 | 9:49 PM

Is white rice harmful for your health? దక్షిణ భారతంలో ఎక్కువ శాతం ఇళ్లలో వరి అన్నం పరిపాటి. ఏది తిన్నా ఒక్క ముద్దైనా అన్నం తినకపోతే ఆ పూటకి భోజనం చెయ్యనట్టే భావిస్తారు. రోజూ తెల్ల బియ్యం తింటే ఆరోగ్యానికి హానికరం అని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. తెల్ల బియ్యం తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే బియ్యం మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిచదనే విషయం ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించాయి. రోజు అన్నం తినే వారినో మీరు కూడా ఉంటే ఖచ్చితంగా ఈ విషయాలపై శ్రద్ధ పెట్టడం అవసరం. అవేంటంటే..

తెల్ల బియ్యంలోని పోషక విలువలు.. USDA Food Data Central ప్రకారం.. ఒక కప్పు అన్నంలో 53 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల కాల్షియం, 2.72 గ్రాముల ఐరన్, 15 గ్రాముల మెగ్నీషియం, 4.39 గ్రాముల ప్రోటీన్, 242 కేలరీలు ఉంటాయి. తెల్ల బియ్యంలో ఫోలేట్, థయామిన్ తక్కువ మొత్తంలో ఉంటుంది. దీనితో పాటు పొటాషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ఖనిజాలు కూడా అన్నంలో ఉంటాయి. మీరు రోజూ అన్నం తింటే.. అందులే విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ డి అస్సలు ఉండవని తెలుసుకోండి. వైట్ రైస్‌ని ఎక్కువ మోతాదులో తినడం వల్ల శరీరంలో అనేక పోషకాలు లోపిస్తాయి.

తెల్ల బియ్యం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేయదు 1. అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ తెల్ల బియ్యంలో చాలా కార్బోహైడ్రేట్లు లభిస్తాయని, శరీరానికి అవసరమైన మాక్రోన్యూట్రియెంట్స్ ఉండవని తెలుసా? అంతేకాకుండా ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా మీ కడుపులో ఇతర ఆహార పదార్థాలకు చోటు లేకుండా చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు పూర్తిగా వరి బియ్యం అన్నంపై ఆధారపడకూడదు.

2. గ్లైసెమిక్ ఇండెక్స్ సమస్య కొన్ని నివేదికల ప్రకారం.. ప్రతిరోజూ తెల్ల బియ్యం తినే వ్యక్తులకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వైట్ రైస్ దాదాపు పూర్తిగా కార్బోహైడ్రేట్లతో తయారవుతుంది. వైట్ రైస్‌లో దాదాపు 73 GI ఉంటుంది. అంటే అది తిన్నప్పుడు రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది.

వైట్ రైస్ vs బ్రౌన్ రైస్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నేషనల్ ప్రకారం.. ఒక 186 గ్రాముల అన్నంలో.. కేలరీలు: 242 ప్రోటీన్: 4.43 గ్రా కొవ్వు: 0.39 గ్రాములు కార్బోహైడ్రేట్లు: 53.2 గ్రాములు ఫైబర్: 0.56 గ్రాములు

202 గ్రాముల బరువున్న బ్రౌన్ రైస్‌లో ఇవి ఉంటాయి.. కేలరీలు: 248 ప్రోటీన్: 5.54 గ్రా కొవ్వు: 1.96 గ్రాములు కార్బోహైడ్రేట్లు: 51.7 గ్రాములు ఫైబర్: 3.23 గ్రాములు

కాబట్టి ఆహారంలో వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడానికి వైట్‌ రైస్‌కి బదులు బ్రౌన్ రైస్ తినాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) కూడా చెబుతోంది. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం, స్ట్రోక్, ఊబకాయం, గుండె జబ్బులు, మలబద్ధకం మొదలైన వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే తెల్ల అన్నంకి జర దూరంగా ఉండటమే సో.. బెటర్‌!

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులను కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

Also Read:

Health Tips: రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే.. ఈ చిన్నపాటి చిట్కాలు పాటించడం చాలా అవసరం..!