Banana Tips: అరటి పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ పాటించండి, చాలా కాలం ఫ్రెష్‌గా ఉంటాయి..
Banana Tips: అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ ధరలో ఆరోగ్యాన్ని అందించే వాటిగా వీటికి పేరు ఉంది. వైద్యులు సైతం కచ్చితంగా అరటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. అయితే అరటి పండ్లతో వచ్చే ప్రధాన సమస్య..
Banana Tips: అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ ధరలో ఆరోగ్యాన్ని అందించే వాటిగా వీటికి పేరు ఉంది. వైద్యులు సైతం కచ్చితంగా అరటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. అయితే అరటి పండ్లతో వచ్చే ప్రధాన సమస్య వాటిని స్టోర్ చేయడం. ఒకేసారి ఎక్కువ మోతాదులో కొనుగోలు చేసిన పండ్లు తక్కువ సమయంలో పాడవుతాంటాయి. దీంతో తినేవి తక్కువ పాడేసేవి ఎక్కువ అన్నట్లు పరిస్థితి మారుతుంది. మరి అరటి పండ్లను చాలా కాలంపాటు తాజాగా నిల్వ ఉంచే టెక్నిక్ ఉందని మీకు తెలుసా.? కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా అరటి పండ్లను తాజాగా ఉండేలా చేయొచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటంటే..
* సాధారణంగా మనం అరటి పండ్లను కొనుగోలు చేసినప్పుడు ప్లాస్టిక్ కవర్స్‌లో పెట్టి విక్రయిస్తుంటారు. చాలా మంది పండ్లను ఇంటికి తెచ్చుకున్న తర్వాత కవర్‌లోనే పెట్టేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల పండ్లు త్వరగా పాడవుతాయి. కాబట్టి పండ్లను ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కవర్స్ ఉంచకూడదు.
* అరటి పండ్లను గది ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయాలి. అలాగే సూర్యరక్ష్మి నేరుగా పడే చోట కూడా వీటిన ఉంచకూడదు.
* ఇక అరటి పండ్లు ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండాలంటే వాటిని ఇంటికి తీసుకురాగానే గుత్తి నుంచి అన్నింటినీ వేరు చేయాలి. ఎందుకంటే గుత్తిలోని ఒక్క పండు పాడవుతే వెంటనే అన్ని పాడవుతాయి. ఇలా చేస్తే అన్ని పండ్లు ఒకేసారి పాడవకుండా ఉంటాయి.
* మనలో చాలా మంది అరటి పండ్లను కూడా ఇతర పండ్లతో కలిపి స్టోర్ చేస్తుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకూడదు. దీనికి కారణం ఇతర పండ్ల నుంచి విడుదలయ్యే ఇథైలీన్ గ్యాస్ అరటిని త్వరగా పాడయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా అవకాడో, కివిస్, యాపిల్స్, టమాటల వద్ద ఉంచకూడదు.
* అరటి పండ్లు త్వరగా పాడవకుండా ఉండాలంటే వాటిని గాలిలో వేలాడదీయాలి. పాత్రల్లో, బుట్టల్లో పెట్టడం కంటే బాగా గాలి తగిలేలా వేలాడదీస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
Also Read: Actor Ali: సీఎం జగన్ ఫిక్స్ అయ్యారా.. నటుడు అలీని రాజ్యసభకు పంపనున్నారా.?