AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: పేదరికం, గుండె జబ్బు.. పరిస్థితులను ఎదురించి.. నేడు ప్రపంచంలోనే ఖరీదైన ఆటగాడిగా ఖ్యాతి..

Success Story: ఈరోజు సమాజంలో ఎంతో ప్రేరు ప్రఖ్యాతలు, సెలబ్రిటీ హోదా, డబ్బుకి డబ్బు, ఎంతో అభిమాన గణం ఉన్నారు ఉన్నారు. వారిని చూసిన కొందరు.. వారికేమిటి.. జీవితంలో ఏమి లోటుంది.. బోలెడు డబ్బులు..

Success Story: పేదరికం, గుండె జబ్బు.. పరిస్థితులను ఎదురించి.. నేడు ప్రపంచంలోనే ఖరీదైన ఆటగాడిగా ఖ్యాతి..
Football Player Cristiano Ronaldo
Follow us
Surya Kala

|

Updated on: Feb 10, 2022 | 5:06 PM

Success Story: ఈరోజు సమాజంలో ఎంతో ప్రేరు ప్రఖ్యాతలు, సెలబ్రిటీ హోదా, డబ్బుకి డబ్బు, ఎంతో అభిమాన గణం ఉన్నారు ఉన్నారు. వారిని చూసిన కొందరు.. వారికేమిటి.. జీవితంలో ఏమి లోటుంది.. బోలెడు డబ్బులు అంటూ వ్యాఖ్యానిస్తారు. అయితే అలా ఏదోక రంగంలో గుర్తింపు పొందిన వారిలో కొంతమంది సంపన్న కుంటుంబం నుంచి వచ్చిన వారు అయితే.. మరికొందరు తినడానికి తిండి లేకుండా.. పూట గడవని స్టేజ్ నుంచి తమకంటూ ఓ గుర్తింపు కావలని.. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈరోజు సమాజంలో తమకంటూ ఓ గుర్తింపుని సొంతం చేసుకున్నవారు కొందరు. అలాంటి అసాధారణ ప్రతిభావంతులు, సినీ, క్రీడా, శాస్త్రరంగాల్లో ఎందరో ఉన్నారు. అయితే ఈరోజు క్రీడారంగంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేరుపొందిన ఒక ఫుట్ బాల్ క్రీడాకారుడి స్పూర్తివంతమైన జీవితం గురించి తెలుసుకుందాం..

క్రిస్టియానో ​​రొనాల్డో ఫుట్ బాల్ ప్రేమికులకు పరిచయం చేయక్కర్లేని పేరు. అత్యంత ఖరీదైన ఆటగాడి జీవితం నేటి యువతకి ఆదర్శ వంతం. ఒక తోటమాలి కొడుకు నేడు ప్రపంచ ఖ్యాతి గాంచిన ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడిగా పేరు గడించాడు. పోర్చుగల్‌లోని మదీరాలో జోస్ డినిస్ అవీరో, డోలోరెస్ డోస్ శాంటోస్ అవీరో దంపతులకు నలుగురు పిల్లలు. నలుగురు పిల్లల్లో చిన్నవాడైన క్రిస్టియానో ​​రొనాల్డో 5 ఫిబ్రవరి 1985న జన్మించాడు. క్రిస్టియానో తండ్రి మున్సిపాలిటీలో తోటమాలిగా పనిచేస్తే.. తల్లి వంట మనిషిగా పనిచేసింది. ఒక కుమారుడు మరియు ఇద్దరు కుమార్తెలు. అయితే పెద్ద కుటుంబం తల్లిదండ్రుల చాలీచాలని సంపద.. పేదరికంలో ఉండే కష్టాలు అన్నీ బాల్యంలో ఎదుర్కొన్నాడు. చదువు లేదు.. అంతేకాదు గుండె జబ్బు ఇవన్నీ క్రిస్టియానో ​​రొనాల్డో ఎదుర్కొన్నాడు. అయితే అతను పడిన కష్టాలు.. అతని లక్ష్యం నుంచి దూరం చేయలేకపోయాయి.

చిన్నతనం నుంచి ఫుట్ బాల్ ఆటపై ఆసక్తిని కబరిచేవాడు. ఎలాగైనా సరే తాను ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ గా మారాలనుకున్నాడు. అయితే రొనాల్డో తన ఉపాధ్యాయుడిపై కుర్చీ విసిరి దాడి చేసినందుకు స్కూల్ నుంచి డిబార్ చేశారు. తన ఎనిమిదేళ్ల నుంచి ఆండ్రోరిన్హా తరఫున ఆడుతున్నరొనాల్డో 14 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారడంపై దృష్టి పెట్టాడు.

1995లో తన సొంత పట్టణమైన మదీరాలో ఉన్న ‘నేషనల్’ క్లబ్‌లో చేరిన క్రిస్టియానో ​​రొనాల్డో ఆటలో నైపుణ్యం చూపించి.. అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అనంతరం ట్రయల్‌ను క్లియర్ చేసి పోర్చుగల్‌లోని అతిపెద్ద క్లబ్‌లలో ఒకటైన స్పోర్టింగ్ CPలో చేరాడు. తర్వాత గుండె శస్త్రచికిత్స చేయించుకున్నాడు. మళ్ళీ క్రీడా మైదానంలో అడుగు పెట్టాడు. తన అద్భుతమైన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో, రొనాల్డో గోల్స్ చేసే విధానం ఎవరూ ఊహించలేరు. ప్రత్యర్థులు రొనాల్డోను గోల్ చేయకుండా ఎలా అడ్డుకోవాలో తెలియక అనేక ప్రణాళికలు రచించేవారు. 2003లో, మాంచెస్టర్ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాళ్ళు .. రోనాల్డ్ ఆటను చూసి.. తమ జట్టులోకి ఆహ్వానించమని.. తమ జట్టు మేనేజర్ ను కోరారు. మాంచెస్టర్ ఫుట్‌బాల్ యాజమాన్యం భారీ మొత్తంలో చెల్లించి రోనాల్డో ని తమ జట్టులోకి తీసుకున్నారు. ప్రపంచంలో అతి ఖరీదైన ఆటగాళ్ళలో ఒకడుగా ఖ్యతిగాంచాడు. పేదరికాన్ని, అనారోగ్యాన్ని లెక్కచేయకుండా తాను అనుకున్న విధంగా ఫుట్ బాల్ ఆటలో తనదైన ముద్ర వేసి నేటి యువతకు స్పూర్తిగా నిలిచాడు.

Also Read:   పాన్ లో ఆహరం అంటుకుంటుందని ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం..