AWES Recruitment 2022 : టీజీటీ, పీజీటీ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే..
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) దేశవ్యాప్తంగా వివిధ సైనిక పాఠశాలల్లో TGT, PGT, PRT టీచర్ పరీక్షల కోసం హాల్ టికెట్లను విడుదల చేసింది..
AWES Army School Admit Card 2022: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) దేశవ్యాప్తంగా వివిధ సైనిక పాఠశాలల్లో TGT, PGT, PRT టీచర్ పరీక్షల కోసం హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్మీ స్కూల్ టీజీటీ, పీజీటీ, పీఆర్టీ రిక్రూట్‌మెంట్ 2022 ద్వారా మొత్తం 8700 పోస్ట్‌లు రిక్రూట్ చేయనున్నారు. అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ పేరు, సబ్జెక్ట్ పేరు, రోల్ నంబర్, చిరునామా, పరీక్షా కేంద్రం, తేదీలను తనిఖీ చేసుకోవల్సి ఉంటుంది. కాగా ఆర్మీ స్కూల్‌లో ఉపాధ్యాయుల నియామకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 7 నుంచి 28 వరకు జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్awesindia.comను తనిఖీ చేయవచ్చు. ఈ పరీక్ష ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, ఆగ్రా, వారణాసి, గోరఖ్‌పూర్, లక్నో, మీరట్, బరేలీ, నోయిడా, ఢిల్లీ, ఝాన్సీ, డెహ్రాడూన్, జైపూర్, జబల్‌పూర్, భోపాల్‌లలో నిర్వహించబడుతుంది. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత అభ్యర్ధులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత టీచింగ్ ఎబిలిటీని అంచనా వేస్తారు. ఈ దశలన్నింటి తర్వాత తుది ఎంపిక జరుగుతుంది.
అడ్మిట్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్- awesindia.comను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్ పేజీలో ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ టీచర్ రిక్రూట్‌మెంట్ ఓఎస్టీపై క్లిక్ చెయ్యాలి.
- న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో రిజిస్టర్డ్ ఐడీని నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
- స్క్రీన్‌పై హాల్‌టికెట్ ఓపెన్ అవుతుంది.
- సేవ్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Also Read: