Hijab row update: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. సోమవారం నుంచి..
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.డ్రెస్ కోడ్‌పై ఎవరినీ బలవంతంచేయొద్దన్న న్యాయస్ధానం.
Hijab row update: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డ్రెస్ కోడ్‌పై ఎవరినీ బలవంతంచేయొద్దన్న న్యాయస్ధానం.. ఈ సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరచుకోవచ్చని కర్ణటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన దుస్తుల కోసం పట్టుబట్టకూడదని తీర్పువచ్చేవరకు, క్లాస్ రూంలలో విద్యార్ధులు హిజాబ్‌లు, కాషాయ కండువాలు ధరించవద్దని సూచించింది. కాగా ముస్లిం యువతులు పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడంపై కర్ణాటకలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టులో ఉండగా.. మరో వైపు ఇదే అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఇటీవల ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడంపై అవగాహన కల్పించడానికి ఫిబ్రవరి 1న ప్రపంచ హిజాబ్ దినోత్సవాన్ని నిర్వహించారు. దీని తర్వాత హిజాబ్ వివాదం మరింత పెరిగింది. చాలామంది ముస్లిం మహిళలు హిజాబ్‌కు అనుకూలంగా ప్రదర్శనలు చేస్తున్నారు.
ఏమిటీ హిజాబ్ వివాదం.. కర్ణాటకలోని ఓ ప్రభుత్వ కళాశాలలో తరగతి గదిలో హిజాబ్ ధరించడాన్ని నిరాకరించడంతో హిజాబ్ వివాదం మొదలైంది. దీనిపై 8 మంది ముస్లిం విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. తరువాత చాలా కాలేజీల్లో ఈ వివాదం మొదలైంది. ఈమధ్య ఓ కాలేజీలో హిజాబ్ ధరించిన అమ్మాయిలను విడిగా కూర్చోబెట్టారు. ఈ విషయంపై నిరంతర నిరసనలు కొనసాగుతున్నాయి.
అయితే ముస్లిం మహిళలకు హిజాబ్ ఎందుకు అవసరం.. అలాగే హిజాబ్, నిఖాబ్, బుర్ఖా, దుపట్టాలకు తేడా ఎంటో చాలా మందికి తెలియదు. నిజానికి హిజాబ్ – నిఖాబ్‌కి చాలా తేడా ఉంటుంది. హిజాబ్ అంటే తెర. హిజాబ్ ధరించిన మహిళలు జుట్టును పూర్తిగా కప్పి ఉంచాలి. హిజాబ్‌లో మహిళలు తమ జుట్టును మాత్రమే కప్పుకుంటారు. మహిళలు తల, మెడను ఏదైనా క్లాత్‌తో కప్పి ఉంచడాన్ని హిజాబ్ అంటారు. కానీ ముఖం మాత్రం కనిపిస్తుంది.
బురఖా అంటే.. బురఖా అంటే స్త్రీల శరీరం పూర్తిగా కప్పబడి ఉంటుంది. తల నుంచి కాళ్ల వరకు శరీరాన్ని మొత్తం కప్పి ఉంచుతుంది. కళ్ళపై ఒక వీల్ ఉంటుంది. బురఖా ధరిస్తే మహిళ శరీరంలోని ఏ భాగం కనిపించదు. చాలా దేశాల్లో దీనిని అబాయా అని కూడా అంటారు.
నికాబ్ అంటే.. నికాబ్ అనేది ఒక రకమైన క్లాత్ మాస్క్. ఇది ముఖంపై ఉంటుంది. ఇందులో మహిళ ముఖం కనిపించదు. కానీ కళ్లు మాత్రం కనిపిస్తాయి.
దుపట్టా అంటే.. దుపట్టా అనేది చాలా సాధారణమైన వస్త్రం. ఇది ఒక రకమైన పొడవాటి కండువా లాంటిది. ఇది తలపై నుంచి కప్పబడి ఉంటుంది. దక్షిణ ఆసియాలో ఎక్కువగా ఉపయోగిస్తారు. హిజాబ్ లాగా బిగుతుగా ఉండదు.
BREAKING : Karnataka High Court Chief Justice says the bench will pass an order directing the opening of the colleges but no student should insist on wearing religious dress when the matter is pending. Hearing to continue on Monday at 2.30 PM.#HijabRow https://t.co/BMSKtiYDkC
— Live Law (@LiveLawIndia) February 10, 2022
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.