Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkey Fever: కరోనా తగ్గిందని సంతోషించే లోపే మరో వైరస్‌.. కేరళలో మరోసారి వెలుగులోకి మంకీ ఫీవర్‌.

Monkey Fever: కరోనా (Corona) థార్డ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టింది, రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని అందరూ సంతోషించారు. వైద్య నిపుణులు సైతం ఇకపై భయాపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. అయితే ఈ సంతోషాన్ని ఆవిరిచేస్తూ మరో మయదారి రోగం దేశంలో మరోసారి వెలుగు..

Monkey Fever: కరోనా తగ్గిందని సంతోషించే లోపే మరో వైరస్‌.. కేరళలో మరోసారి వెలుగులోకి మంకీ ఫీవర్‌.
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 10, 2022 | 5:02 PM

Monkey Fever: కరోనా (Corona) థార్డ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టింది, రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని అందరూ సంతోషించారు. వైద్య నిపుణులు సైతం ఇకపై భయాపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. అయితే ఈ సంతోషాన్ని ఆవిరిచేస్తూ మరో మయదారి రోగం దేశంలో మరోసారి వెలుగు చూసింది. గతేడాది కర్ణాటకలో మంకీ ఫీవర్‌ కేసు దేశంలో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేరళలో కూడా ఈ వైరస్‌ కేసు వెలుగులోకి వచ్చింది. కేరళలోని వయనాడ్‌లో మంకీ కేసు బయటపడింది. వయనాడ్‌లోని పనవల్లీ గిరిజన ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల వ్యక్తికి మంకీ ఫీవర్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. 2022లో కేరళలో నమోదైన తొలి కేసు ఇదే.

పనవల్లీ గిరిజన ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల వ్యక్తి గతకొన్ని రోజులుగా తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించడంతో మంకీ ఫీవర్‌ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన వైద్యులు పరీక్షలు నిర్వహిచంగా మంకీ ఫీవర్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ యువకుడిని వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు. మంకీ ఫీవర్‌ కేసు నమోదు కావడంతో అధికారులు ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలను ప్రారంభించారు.

అసలేంటీ మంకీ ఫీవర్‌..

ఇది కోతుల నుంచి మనుషులకు సంక్రమించే ఒక వైరల్‌ ఫీవర్‌. ప్లావివిరిడే అనే జాతికి చెందిన వైరస్‌ ద్వారా ఈ ఫీవర్‌ వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ వల్ల యెల్లో ఫీవర్‌ కూడా సోకుతుంది. ఇవి కూడా కోతుల నుంచి సంక్రమిస్తుంది. మంకీ ఫీవర్‌ పెద్దగా ప్రాణంతకం కాకపోయినప్పటికీ.. ఈ వైరస్‌ సోకిన వారిలో 5 నుంచి 10 శాతం మరణించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ వ్యాధి లక్షణాల విషయానికొస్తే.. విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, కండరాల నొప్పులు ఉంటాయి.

Also Read: Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ పోస్టులు.. నెలకు రూ. 70 వేలకుపైగా జీతం..

Khiladi: అందరి సమక్షంలో హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పిన ‘ఖిలాడి’ డైరెక్టర్‌.. కారణం ఏంటంటే..

Tesla: ఉద్యోగాలు చైనీయులకా… అమ్మకాలు భారత్ లోనా… కేంద్ర మంత్రి ఫైర్..