Tesla: అమ్మకాలు భారత్ లో.. ఉద్యోగాలు చైనీయులకా.. కేంద్ర మంత్రి ఫైర్..

Tesla: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు భారత ప్రభుత్వం తరఫు నుంచి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కార్లను చైనాలో తయారు చేయడంపై ఇలా స్పందించింది...

Tesla: అమ్మకాలు భారత్ లో.. ఉద్యోగాలు చైనీయులకా.. కేంద్ర మంత్రి ఫైర్..
Tesla
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 10, 2022 | 6:17 PM

Tesla: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు భారత ప్రభుత్వం తరఫు నుంచి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కార్లను చైనాలో తయారు చేసి భారత్ లో విక్రయిస్తే రాయితీలు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ లోక్ సభలో స్పష్టం చేశారు. కార్ల తయారీ చైనాలో చేసి అక్కడ ఉద్యోగాలు కల్పిస్తూ.. వాటిని మన దేశంలో అమ్మడం సరికాదని అన్నారు. ప్రభుత్వ పరంగా అందిస్తు్న్న వివిధ రాయితీ పథకాలకు టెస్లా ఇప్పటివరకు ఎటువంటి అభ్యర్థన చేయలేదని అన్నారు. లోక్ సభలో అడిగిన ప్రశ్నకు బదులుగా.. మోదీ ప్రభుత్వ పాలసీ ప్రకారం భారత విపణిలో లబ్ధి పొందాలనుకునే కంపెనీలు దేశంలోని వారికి ఉపాధి అవకాశాలు కలిగించేవిగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.

దీనికి ముందు గతంలో మస్క్ ఎలక్ట్రి వాహనాలపై దిగుమతి సుంకాలు తగ్గించాలంటూ చేసిన విజ్ఞప్తి మనకు తెలిసిందే. దీనికి తోడు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సైతం టెస్లా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం కూడా మనకు తెలిసిందే.

ఇలా దేశంలో అనేక రాష్ట్రాల నేతలు సైతం టిట్టర్ వేదికగా ఎలన్ మస్క్ కు ఆహ్వానం పలకడం మనం చూశాము. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి సైతం భారత్ లో తమ తయారీ ప్రారంభిస్తేనే పన్ను రాయితీలపై చేసిన అభ్యర్థనలను పరిగణిస్తామని వెల్లడించింది. ఇప్పటికీ భారత్ లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఇంకా తెరిచే ఉన్నాయని.. దానిని ఇక్కడి ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చని కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి…

Ratan Tata: రతన్ టాటా గ్యారేజీకి ఎలక్ట్రిక్‌ నానో కారు.. 72వీ నానో విద్యుత్తు కారులో ప్రయాణించిన పారిశ్రామికవేత్త..

SIM Cards: మీ పేరుపై ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయి..? ఈ విధంగా తెలుసుకోవచ్చు.. బ్లాక్‌ చేసుకోవచ్చు