Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

e-RUPI: డిజిటల్ చెల్లింపులకు ఆర్బీఐ ఊరట.. ఆ లిమిట్ రూ. లక్ష వరకు పెంచుతూ నిర్ణయం..

e-RUPI: డిజిటల్ చెల్లింపులు లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఆగస్టు 2021లో తీసుకొచ్చిన ప్రీ-పెయిడ్ డిజిటల్ ఓచర్ల(Digital Voucher) చెల్లింపుల పరిమితిని...

e-RUPI: డిజిటల్ చెల్లింపులకు ఆర్బీఐ ఊరట.. ఆ లిమిట్ రూ. లక్ష వరకు పెంచుతూ నిర్ణయం..
E Rupi
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 10, 2022 | 6:16 PM

e-RUPI: డిజిటల్ చెల్లింపులు లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఆగస్టు 2021లో తీసుకొచ్చిన ప్రీ-పెయిడ్ డిజిటల్ ఓచర్ల(Digital Voucher) చెల్లింపుల పరిమితిని రూ. 10,000 నుంచి రూ. లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి విదానంపై మాట్లాడుతూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్(RBI Governor Shakti kanta Das) దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనివల్ల వివిధ ప్రభుత్వ పథకాలు పొందుతున్న ప్రజలకు రానున్న కాలంలో.. వాటిని అందించడంలో మరింత పారదర్శకతతో పాటు సమర్థత పెరుగుతుందని ఆయవ వెల్లడించారు.

అసలు ఇంతకీ e-RUPI అంటే ఏమిటి..?

e-RUPI అనేది ఒక్కసారి వినియోగానికి పనికొచ్చే డిజిటల్ ఓచర్. ఇది కాంటాక్ట్ లెస్ పేమెంట్ చేసే విధానంపై పనిచేస్తుంది. దీని వల్ల వినియోగదారుడు ఎటువంటి కార్డు, డిజిటల్ చెల్లింపులు చేసే యాప్, ఇంటర్ నెట్ బ్యాంకింగ్ లాంటివి అవసరం లేకుండా డిజిటల్ చెల్లింపు చేసే కొత్త పద్ధతి. e-RUPI అనేది.. ఆర్బీఐ రానున్న కాలంలో తీసుకురానున్న డిజిటల్ కరెన్సీ కాదు. ఇది ఒక వ్యక్తికి లేదా ఒక ప్రత్యేక పని కోసం అవసరాను కూలంగా ఇచ్చే ఒక డిజిటల్ చెల్లింపు సాధనం. ఈ ఓటర్ వినియోగదారుని ఫోన్ కి మెసేజ్, క్యూఆర్ కోడ్ రూపంలో వస్తుంది. దీనిని అనుమంతిచే ఏదైనా కేంద్రం వద్ద సదరు వ్యక్తి డ్రా చేసుకోవచ్చు.

ఇలా వినియోగించుకోవచ్చు..

ఉదాహరణకు.. ఒక ప్రభుత్వ ఉద్యోగి వైద్య చికిత్సకు సంబంధించి ఆస్పత్రికి చెల్లించాల్సిన తరుణంలో.. చెల్లించాల్సిన డబ్బు విలువకు సరైన ఒక e-RUPI ఓచర్ ను డబ్బుకు బదులుగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం సంబంధిత బ్యాంకు ద్వారా లబ్ధిదారుని ఫోన్ కు మెసేజ్ ద్వారా ఓటర్ ను పంపుతుంది. దానిని సదరు ఉద్యోగి ఆసుపత్రి బిల్లుకు బదులుగా చెల్లింపు చేసేందుకు వినియోగిస్తారు. పాత కాలంలో లాగా డబ్బు నేరుగా చెల్లించడానికి బదులుగా ఈ కొత్త డిజిటల్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం దేశంలో అమలులోకి తెచ్చింది.

ఇవీ చదవండి..

Tesla: ఉద్యోగాలు చైనీయులకా… అమ్మకాలు భారత్ లోనా… కేంద్ర మంత్రి ఫైర్..

Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ పోస్టులు.. నెలకు రూ. 70 వేలకుపైగా జీతం..