Digital Rupee: డిజిటల్ రూపీ ఎలా పనిచేస్తుంది..? పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం..
Digital rupee: తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ చెల్లింపుల కోసం 'డిజిటల్ రూపీ' (Digital rupee)ని దేశంలో తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అయితే...
Digital Rupee: తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ చెల్లింపుల కోసం ‘డిజిటల్ రూపీ’ (Digital rupee)ని దేశంలో తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఇది ఎలా ఉండబోతుంది..? దీనిని ఎలా వినియోగించుకోవాలి..? అనే వాటిపై ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటినీ నివృత్తు చేసే విధంగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రవి శంకర్ ఇవాళ ఆసక్తికరంగా వివరణ ఇచ్చారు.
డిజిటల్ రూపీ అనేది సాదారణంగా మనం వాడుకలో వినియోగించే భౌతిక రూపాయి(physical rupee) లాగానే వినియోగించుకోవచ్చని చెప్పారు. కేవలం రెండిటికీ ఉండే తేడా వాటి రూపం మాత్రమేనని తెలిపారు. భౌతికం అయినా.. డిజిటల్ అయినా వినియోగించే విదానం మాత్రం ఒకేలా ఉంటుందని పేర్కొన్నారు. దీనిని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. డిజిటల్ రూపీ.. ప్రైవేటు క్రిప్టో కరెన్సీ కాదని మరో సారి రవి శంకర్ వివరణ ఇచ్చారు. డిజిటల్ రూపీని భారత ప్రభుత్వానికి సంబంధించి ఆర్బీఐ విడుదల చేస్తుందని తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ హామీ కలిగి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రైవేటు క్రిప్టో కరెన్సీలకు సంబంధించి ఆర్బీఐ ఉద్దేశంపై గవర్నర్ శక్తికాంత దాస్ స్పందిస్తూ.. వాటితో ప్రజలకు పెను ముప్పు పొంచి ఉందని అన్నారు. వాటి వల్ల దేశంలో ఆర్థిక స్థిరత్వానికి చాలా ఇబ్బందులు ఉంటాయని వెల్లడించారు.
బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని భారత్ లో తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో చెల్లింపులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రభుత్వ గ్యారెంటీ కలిగిన డిజిటల్ రూపీ రానున్న కాలంలో ప్రజలకు చెల్లింపుల విషయంలో ఎంతగానో ఉపకరిస్తుందని.. త్వరలోనే దేశ ప్రజలకు దానిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు వేగవంతంగా జరుగుతున్నాయని ప్రస్తుత వివరణతో తేటతెల్లమైంది. కాలానుగుణంగా కేంద్రం.. డిజిటల్ చెల్లింపులకు కొత్త మార్గాలను దేశ ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది.
ఇవీ చదవండి..
e-RUPI: డిజిటల్ చెల్లింపులకు ఆర్బీఐ ఊరట.. ఆ లిమిట్ రూ. లక్ష వరకు పెంచుతూ నిర్ణయం..
Tesla: ఉద్యోగాలు చైనీయులకా… అమ్మకాలు భారత్ లోనా… కేంద్ర మంత్రి ఫైర్..