Reliance: కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెడుతున్న అంబానీ.. ఆ కంపెనీలో వాటాల కొనుగోలు..

Reliance: భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొంతకాలంగా వ్యూహాత్మక పెట్టుబడులతో ముందుకు వెళుతోంది. తాజాగా భారత కుభేరుల జాబితాలో మెుదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయిన ముకేశ్ అంబానీ..

Reliance: కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెడుతున్న అంబానీ.. ఆ కంపెనీలో వాటాల కొనుగోలు..
Reliance Industries
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 10, 2022 | 8:09 PM

Reliance: భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొంతకాలంగా వ్యూహాత్మక పెట్టుబడులతో ముందుకు వెళుతోంది. తాజాగా భారత కుభేరుల జాబితాలో మెుదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయిన ముకేశ్ అంబానీ.. అదానీ గ్రూప్ కు ధీటుగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. సదరు రెండు సంస్థలు ప్రస్తుతం పోటాపోటీగా భవిష్యత్తు తరాల్లో అవసరమైన టెక్నాలజీలు, రంగాలు, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టుకుంటూ దూకుడుగా రిలయన్స్ సంస్థ ప్రస్తుతం దేశంలో ముందుకు సాగుతోంది. వరుసగా కొత్త కంపెనీల్లో వాటాలు కొంటూ ముందుకు వెళుతున్న బిలియనీర్ అంబానీ.. వ్యాపార రంగంలో తనదైన మార్క్ నిలబెట్టుకునేందుకు అంబానీ కృషి చేస్తున్నారు.

ఇందులో భాగంగా రిలయన్స్ సంస్థ ఆల్టీగ్రీన్ ప్రొపల్షన్ ల్యా్బ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీని రూ. 50.16 కోట్లు వెచ్చించి కొంటున్నట్లు స్పష్టం చేసింది. ఈ డీల్ కోసం రిలయన్స్ కు సంబంధించిన సబ్సిడరీ కంపెనీ రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ వివరాలను రిలయన్స్ సంస్థ స్టాక్ మార్కెట్ ఎక్స్ ఛేంజ్ కు తెలిపింది. ఈ ప్రక్రియ మార్చి 2022 నాటికి పూర్తవుతుందని తెలిపింది. దీనికి తోడు కొంతకాలం క్రితం రూ. 2,845 కోట్లు వెచ్చించి.. షారోంజి పల్లోంజి గ్రూప్ కు చెందిన స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థలో 40 శాతం వాటాలు కొనుగోలు నేడు పూర్తైంది.

బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆల్టీగ్రీన్ ప్రొపల్షన్ ల్యా్బ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలకు లాస్ట్ మైలేజ్ రవాణాకు సంబంధించి సేవలను అందిస్తూ ఉంటుంది. 2/3/4 చక్రాల వాహనాలకు తమ సేవలను అందిస్తుంది. 100 శాతం తమ సొంత టెక్నాలజీతో సదరు సంస్థ E3W అనే వాహనాన్ని తయారు చేసింది. 2013లో ప్రారంభమైన ఈ సంస్థ 2020-21 ఆర్థిక సంవస్సరంలో రూ. 104 కోట్ల టర్నోవర్ చేసింది.

ఆల్టీగ్రీన్ ప్రస్తుత పేటెంట్ పోర్ట్‌ఫోలియో 26 గ్లోబల్ పేటెంట్‌లతో 60 దేశాల్లో విస్తరించి ఉంది. ఆల్టిగ్రీన్ యొక్క ప్రస్తుత సాంకేతికతలలో ఎలక్ట్రిక్ మోటార్లు, జనరేటర్లు.. వాహన నియంత్రణలు, మోటారు నియంత్రణలు, EV ట్రాన్స్‌మిషన్‌లు, టెలిమాటిక్స్ & IoT తో పాటు బ్యాటరీల నిర్వహణలో వినియోగిస్తున్నారు.

ఇవీ చదవండి..

Digital Rupee: డిజిటల్ రూపీ ఎలా పనిచేస్తుంది..? పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం..

e-RUPI: డిజిటల్ చెల్లింపులకు ఆర్బీఐ ఊరట.. ఆ లిమిట్ రూ. లక్ష వరకు పెంచుతూ నిర్ణయం..