Ratan Tata: రతన్ టాటా గ్యారేజీకి ఎలక్ట్రిక్‌ నానో కారు.. 72వీ నానో విద్యుత్తు కారులో ప్రయాణించిన పారిశ్రామికవేత్త..

ఎలక్ట్రిక్ వెహికల్స్ పవర్‌ట్రెయిన్ సొల్యూషన్స్ కంపెనీ ఎలక్ట్రా EV తయారు చేసిన 72వీ నానో విద్యుత్తు కారు రతన్ టాటాకు అందించారు. ఈ విషయాన్ని ఎలక్ట్రా ఈవీ లింక్డ్‌ఇన్‌ ఖాతాలో తెలిపింది...

Ratan Tata: రతన్ టాటా గ్యారేజీకి ఎలక్ట్రిక్‌ నానో కారు.. 72వీ నానో విద్యుత్తు కారులో ప్రయాణించిన పారిశ్రామికవేత్త..
Tata
Follow us

|

Updated on: Feb 10, 2022 | 2:01 PM

ఎలక్ట్రిక్ వెహికల్స్ పవర్‌ట్రెయిన్ సొల్యూషన్స్ కంపెనీ ఎలక్ట్రా EV తయారు చేసిన 72వీ నానో విద్యుత్తు కారు రతన్ టాటాకు అందించారు. ఈ విషయాన్ని ఎలక్ట్రా ఈవీ లింక్డ్‌ఇన్‌ ఖాతాలో తెలిపింది. టాటాకు కారు డెలివరీ చేసినందుకు గర్వంగా ఉందని, ఆయన నుంచి ఫీడ్‌బ్యాక్‌ కూడా తీసుకున్నామని తెలిపింది. రతన్ టాటాకు EV కారును డెలివరీ చేయడం గర్వంగా ఉందని పేర్కొంది. ఆయన నుంచి ఫీడ్‌బ్యాక్‌ కూడా తీసుకున్నామని తెలిపింది. వారి పోస్ట్‌లో 84 ఏళ్ల రతన్ టాటాతో అతని 28 ఏళ్ల సహాయకుడు శాంత నాయుడుతో కలిసి కారుతో చిత్రాన్ని ఉంచారు.

‘‘ఎలక్ట్రా ఈవీకి ఇవి ఆనంద క్షణాలు. మా వ్యవస్థాపకుడు రతన్‌ టాటా సరికొత్త 72వీ నానో విద్యుత్‌ కారులో ప్రయాణించారు. టాటాకు నానో ఈవీ డెలివరీ చేయడం, ఆయన నుంచి అమూల్యమైన ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం అత్యంత గౌరవంగా భావిస్తున్నాం’’ అని ఎలక్ట్రా ఈవీ పోస్ట్‌లో రాసింది. కస్టమ్-బిల్ట్ నానో EVలో ఉపయోగించిన 72V తయారు చేశారు. ఈ కారులో నాలుగు సీట్లు ఉంటాయి. ఒక్క సారి ఛార్జింగ్‌ చేస్తే 160 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.10 సెకన్లలోపు 0-60 కి.మీ. వెళ్తుంది. టాటా మోటార్స్ EV సూపర్ పాలిమర్ లిథియం-అయాన్ బ్యాటరీ కారులో అమర్చారు.

Read Also.. RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచిన ఆర్బీఐ.. వృద్ధి రేటు అంచనా 9.2శాతానికి కుదింపు..