SIM Cards: మీ పేరుపై ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయి..? ఈ విధంగా తెలుసుకోవచ్చు.. బ్లాక్‌ చేసుకోవచ్చు

SIM Cards: ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఫోన్‌ ఉపయోగించుకునేదే. ఫోన్‌ కాల్స్‌ కోసం జియో, ఎయిర్‌ టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇలా సిమ్‌ కార్డులు ఎవరికి నచ్చినట్లు..

SIM Cards: మీ పేరుపై ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయి..? ఈ విధంగా తెలుసుకోవచ్చు.. బ్లాక్‌ చేసుకోవచ్చు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 10, 2022 | 12:52 PM

SIM Cards: ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఫోన్‌ ఉపయోగించుకునేదే. ఫోన్‌ కాల్స్‌ కోసం జియో, ఎయిర్‌ టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇలా సిమ్‌ కార్డులు ఎవరికి నచ్చినట్లు వారు వాడుతుంటారు. అయితే చాలా మంది ఎన్నో సిమ్‌ కార్డులను తీసుకుంటారు. గతంలో టెలికం కంపెనీలు ఉచిత బ్యాలెన్స్‌, వ్యాలిడిటీ ఇచ్చిన సమయంలో ఒకటి కంటే ఎక్కువ సిమ్‌ కార్డులను తీసుకుని , బ్యాలెన్స్‌, వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత పక్కనపడేస్తుంటారు. అలాగే కొందరు సిమ్‌ కార్డులను పోగొట్టుకుంటారు. తర్వాత వేరే సిమ్‌ కార్డు తీసుకోవడం, లేదా ఒకటి కంటే ఎక్కువ సిమ్‌ కార్డులను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి 9 సిమ్‌ కార్డులు మాత్రమే ఉండాలని, అంతకంటే ఎక్కువ సిమ్‌ కార్డులు ఉంటే తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇక కొందరికైతే వారి పేరుపైన ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయనే విషయం కూడా తెలియదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ది చెందిన కారణంగా ఒక వ్యక్తిపై ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే ఒక వేళ వాడని సిమ్‌ కార్డులు ఉంటే కూడా వాటిని బ్లాక్‌ చేసుకోవచ్చు. కొందరు సైబర్‌ నేరగాళ్లు ఇతరుల పేర్లపై సిమ్‌ కార్డులను తీసుకుని మోసాలకు పాల్పడుతుంటారు.

ఆధార్‌తో లింకైన సిమ్‌ కార్డుల దుర్వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని టెలికాం శాఖ ఇటీవల టూల్‌ అనలటిక్స్‌ ఫర్‌ ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ (TAFCOP)ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్‌లైన్‌ టూల్‌, పోర్టల్‌తో యూజర్లు ఆధార్‌ నెంబర్‌తో లింకైన మొబైల్‌ నెంబర్లను అన్నింటిని తెలుసుకునే వెసులుబాటు ఉంది.

ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీ ఆధార్‌ కార్డు పై ఇప్పటి వరకు ఎన్ని సిమ్‌ కార్డులను ఉపయోగించారో తెలుసుకోవచ్చు. ఇక మీకు తెలియకుండా మీ ఆధార్‌ నెంబర్‌తో ఏదైనా ఫోన్‌ నెంబర్‌ లింకైనట్లు తేలినట్లయితే మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీ పేరుపై పేరుపై ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీని వల్ల మీరు మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. మీరు https://tafcop.dgtelecom.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఫోన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ (OTP)ని ఎంటర్‌ చేస్తే మీ పేరుపై ఉన్న మొబైల్‌ నెంబర్లు కనిపిస్తాయి. వాటిని బ్లాక్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.

Taf

ఇవి కూడా చదవండి:

Google Chrome Users Alert: గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు హెచ్చరిక.. ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..!

Digital Voter ID Card: మీ డిజిటల్‌ ఓటర్‌ ఐడి కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవాలా..? ఇలా చేయండి..!

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు