Pregnancy Care: గర్భధారణ సమయంలో బరువు తగ్గుతున్నారా? అయితే విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే..!

Pregnancy Care: గర్భధారణ సమయంలో బరువు పెరగడం, తగ్గడం రెండూ హానికరమే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వైద్యుల ప్రకారం.. అతిగా బరువు పెరగడం వల్ల గర్భధారణ..

Pregnancy Care: గర్భధారణ సమయంలో బరువు తగ్గుతున్నారా? అయితే విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే..!
Pregnancy Care
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 10, 2022 | 5:41 PM

Pregnancy Care: గర్భధారణ సమయంలో బరువు పెరగడం, తగ్గడం రెండూ హానికరమే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వైద్యుల ప్రకారం.. అతిగా బరువు పెరగడం వల్ల గర్భధారణ మధుమేహం, అధిక బీపీ వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరం. అదే సమయంలో, సగటు బరువు కంటే తక్కువగా ఉండటం కూడా ప్రమాదకరమే దీని కారణంగా సమస్యలు తలెత్తవచ్చు.

అయితే, ఒక వ్యక్తి బరువును, ఆరోగ్యాన్ని శరీర పొడవు ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం చూస్తే.. గర్భధారణ ముందు మహిళ బరువు కనీసం 45 కిలోలు ఉండాలి. గర్భం దాల్చిన తర్వాత 10 నుంచి 15 కిలోల బరువు పెరగాలి. దీని కంటే తక్కువ బరువు ఉంటే, అప్పుడు స్త్రీ తక్కువ బరువు ఉన్నట్లుగా పరిగణించబడుతుంది. అయితే గర్భధారణ సమయంలో స్త్రీ తక్కువ బరువు ఉన్నట్లయితే గర్భస్రావం, సి-సెక్షన్ డెలివరీ ప్రమాదం పెరుగుతుంది.

తక్కువ బరువు వల్ల కలిగే సమస్యలు.. 1. బరువు తగ్గడం వల్ల కడుపులోని పిల్లలకు హానీ జరుగవచ్చు. అవసరమైన పోషకాలు తల్లీ, బిడ్డకు అందక.. పుట్టబోయే బిడ్డ భవిష్యత్‌లో పోషకాహారం లోపంతో బాధపడుతారు. 2. ఇక పుట్టినప్పుడు శిశువు బరువు చాలా తక్కువగా ఉంటే భవిష్యత్‌లో మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 3. తక్కువ బరువు కారణంగా శిశువు రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. ప్రతిసారి ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతారు. 4. తక్కువ బరువుతో పుట్టిన బిడ్డకు సెరిబ్రల్ పాల్సీ, అభ్యాస వైకల్యాలు, దృష్టి మరియు వినికిడి సమస్యలు వస్తాయి.

ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి ఏం చేయాలి.. 1. ప్రతిరోజూ అల్పాహారంలో ప్రోటీన్స్ ఉండే ఆహారాన్ని పెట్టాలి. 2. భోజన సమయాలను సెట్ చేయాలి. ఒకేసారి ఎక్కువగా తినలేకపోతే.. గంటకోసారి లేదా రెండు గంటలకోసారి కొంచెం కొంచెం ఏదో ఒకటి తినాలి. 3. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకలితో ఉండకూడదు. పండ్లు, ఫలాలు, డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్ వంటివి తినాలి. 4. కాల్షియం కోసం పాలు, పెరుగు, జున్ను మొదలైనవి తిసుకోవాలి. 5. మొలకెత్తిన ధాన్యాలు, బీన్స్ మొదలైన అధిక క్యాలరీలను తీసుకుంటూ ఉండండి.

Also read:

Viral Video: ఓ మై గాడ్.. అదృష్టం అంటే ఇతనిదే.. కొంచెం తేడా అయినా ప్రాణాలే పోయేవి..

Andhra Pradesh News: తెల్లారితే యువకుడి పెళ్లి.. ఆమె ఎంట్రీతో కథంతా రివర్స్ అయ్యింది.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

Andhra Pradesh: కనిగిరి బాలుడి ఆచూకీ లభ్యం.. ఆ విషయంలో దొరికిపోవద్దనే కిడ్నాప్ చేసిందట..!