వివరాల్లోకెళితే.. సెంట్రల్ చిలీలోని కార్డిల్లెరా ప్రావిన్స్ ప్యూంటో ఆల్టో లోని లాస్ విజ్‌కాచాస్ పర్వత ప్రాంతంలో పారాగ్లైడింగ్ జరుగుతోంది. పారాగ్లైడింగ్ కోసం పర్యాటకు ఎంతో ఆసక్తి కనబరిచారు. అయితే, ఓ పారాగ్లైడింగ్ రైడర్.. పర్యాటకులను తనతో పాటు ఎక్కించుకుని ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు. కింద నుంచి ఓ వ్యక్తి వారికి సాయంగా ఉన్నాడు. ఇంతలో ఆ పారాగ్లైడ్ పైకి ఎగిరింది. అయితే, కింద సహాయంగా ఉన్న వ్యక్తి చేతులు పారాగ్లైడ్ బెల్ట్‌లో చిక్కుకుపోయాయి. విడిపించుకునేందుకు ఎంత ట్రై చేసినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు పారాగ్లైడ్ పైకి ఎగరడంతో అతను ఏమీ చేయలేకపోయాడు. ఒంటి చేత్తో ఆ బెల్ట్‌ను గట్టిగా పట్టుకుని బిక్కు బిక్కుమంటూ ఉండిపోయాడు. అయితే, పారాగ్లైడింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని హ్యాండిల్ చేస్తున్న వ్యక్తి ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు. పైగి ఎగసిన పారాగ్లైడ్‌ని నెమ్మదిగా కింది వరకు దింపాడు. భూమికి చేరువవ్వగానే ఆ వ్యక్తి కిందకు దూకేశాడు. దాంతో అతను సేఫ్ అయ్యాడు. ఆ వెంటనే పారాగ్లైడ్ కూడా ఆకాశంలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు గ్రౌండ్ వర్కర్ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇదే విషయాన్ని చిలీ ఎయిర్ ట్రావెల్ రెగ్యులేటర్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏరోనాటిక్స్(DGAC) వెల్లడించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.
Also read:
Andhra Pradesh: కనిగిరి బాలుడి ఆచూకీ లభ్యం.. ఆ విషయంలో దొరికిపోవద్దనే కిడ్నాప్ చేసిందట..!