Hyderabad News: ఈ కేటుగాళ్లు మహా డేంజర్.. నిమ్మిన వారిని నట్టేట ముంచారు.. మరి పోలీసులు ఊరుకుంటారా?, ఇదిగో ఇలా..

Hyderabad News: ఏటీఎం వినియోగదారుల దృష్టి మళ్ళించి ఒరిజినల్ ఏటీఎం కార్డులను(ATM Cards) కాజేసి నఖిలీ ఏటీఎం కార్డును ముట్టజెప్పి ఆపై ఒరిజినల్ ఏటీఎం కార్డుతో డబ్బులు...

Hyderabad News: ఈ కేటుగాళ్లు మహా డేంజర్.. నిమ్మిన వారిని నట్టేట ముంచారు.. మరి పోలీసులు ఊరుకుంటారా?, ఇదిగో ఇలా..
Arrest
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 10, 2022 | 3:47 PM

Hyderabad News: ఏటీఎం వినియోగదారుల దృష్టి మళ్ళించి ఒరిజినల్ ఏటీఎం కార్డులను(ATM Cards) కాజేసి నఖిలీ ఏటీఎం కార్డును ముట్టజెప్పి ఆపై ఒరిజినల్ ఏటీఎం కార్డుతో డబ్బులు కాజేస్తున్న ముఠా సభ్యులను సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) మైలార్ దేవ్ పల్లి పొలీసులు(Mailardevpally Police Station) అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మైలార్ దేవ్ పల్లి సిఐ నర్సింహ వివరించారు. అజయ్ సాహు, నితిన్ కుమార్ సాహు ఇద్దరూ ఏటిఎంల వద్ద నిలబడి వినియోగదారులు ఏటీఎం లో డబ్బులు డ్రా చేస్తుండగా గమనిస్తారు. వారికి సహాయం చేస్తున్నట్లు నటించి.. వారి పిన్ నెంబర్ తెలుసుకుంటారు. ఆ తరువాత వారి ఒరిజినల్ ఏటీఎం కార్డు కాజేసి.. దాని స్థానంలో నఖిలీ ఏటీఎం కార్డును బాధితులకు ముట్టజెప్తారు. వారు వెళ్లిపోగానే.. ఒరిజినల్ ఏటీఎం కార్డులతో ఉన్న డబ్బులన్నీ ఊడ్చేస్తారు.

దీనిపై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితులను కనిపెట్టేందుకు పక్కా స్కెచ్ వేశారు. నిందితుల గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. మైలార్ దేవ్ పల్లి పొలిస్టేషన్ పరిధిలో అజయ్, నితిన్ లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు నింధితుల గురువు శంకర్ పవార్ అలియాస్ భయ్యు వీరికి ఇలాంటి నేరపూరితమైన పనులను నేర్పించి హైదరాబాద్ పంపినట్లు సిఐ నర్సింహ వెల్లడించారు. మైలార్ దేవ్ పల్లి పొలిస్టేషన్ పరిధిలో నాలుగు చోట్ల ఏటీఎం సెంటర్ల వద్ద లక్షా 60 వేల రూపాయలు దొంగలించినట్లు వివరించారు. ఇద్దరు నింధితుల వద్ద నఖిలీ ఏటిఎం కార్డులను, నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

UP Election 2022: మీ వెంట మేమున్నాం.. ముస్లిం మహిళల పోరాటంపై ప్రధాని మోడీ ప్రశంసలు..

Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ పోస్టులు.. నెలకు రూ. 70 వేలకుపైగా జీతం..

Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు మంచి జ్ఞాపక శక్తి, తెలివితేటలు గలవారు.. అందులో మీరున్నారా తెలుసుకోండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?