UP Election 2022: మీ వెంట మేమున్నాం.. ముస్లిం మహిళల పోరాటంపై ప్రధాని మోడీ ప్రశంసలు..
కర్నాటకలో హిజాబ్‌పై వివాదాల కొనసాగుతున్న సమయంలో ప్రధాని మోడీ ముస్లిం మహిళల పోరాటాన్ని ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్ పూర్ లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ముస్లిం మహిళల గౌరవాన్ని కాపాడేందుకు..

కర్నాటకలో హిజాబ్‌పై(karnataka hijab controversy) వివాదం కొనసాగుతున్న సమయంలో ప్రధాని మోడీ(Prime Minister Narendra Modi) ముస్లిం మహిళల పోరాటాన్ని ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్ పూర్ లో(UP Election) జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ముస్లిం మహిళల గౌరవాన్ని కాపాడేందుకు బీజేపీ(BJP) ప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధించిన విషయాన్ని గుర్తు చేశారు. ముస్లిం మహిళల అభివృద్ధి, హక్కులను అడ్డుకునేందుకు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. యూపీలో ముస్లిం మహిళలు అణచివేతకు గురికాకూడదని కోరుకుంటే బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఉండడం అవసరమన్నారు. వారి జీవితంలో యూపీలోని సహరాన్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ, ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి, శతాబ్దాల నాటి ఆచారానికి వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చినందుకు ముస్లిం మహిళలు తమ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారని అన్నారు.
ముస్లిం మహిళలను ట్రిపుల్ తలాఖ్ నుంచి బేజేపీ కాపాడింది. ఇప్పుడు ముస్లిం మహిళలు స్వేచ్ఛగా బీజేపీ ని సమర్థిస్తున్నారు. దీంతో ప్రత్యర్థుల కడుపు మండుతోంది. కానీ, ప్రతి ముస్లిం మహిళకు మేము మద్దతుగా ఉంటామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. యూపీలో తొలి దశ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న రోజే ప్రధాని కీలక అంశంపై మాట్లాడడం గమనార్హం. ప్రతిపక్షాల వారసత్వ రాజకీయాలను ప్రధాని తన ప్రసంగంలో విమర్శించారు. కరోనా మహమ్మారి సమయంలో వారు గనుక అధికారంలో ఉండి ఉంటే టీకాలు మీకు చేరేవి కావు. ఎక్కడో అక్కడ అమ్మేసుకునేవారు. పేదలు గూడు పొందాలనుకుంటే, రూ.5 లక్షల వరకు ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స పొందాలనుకుంటే యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి ప్రధాని మోడీ ఉత్తర్ ప్రదేశ్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
प्रधानमंत्री श्री @narendramodi के आगमन के लिए सहारनपुर में सड़कों पर उमड़ा जनसैलाब। जनता का ये उत्साह बता रहा है कि… जय भाजपा, तय भाजपा#WestUPwithModi#मेरा_वोट_भाजपा_को pic.twitter.com/tP8gjFrKCX
— BJP Uttar Pradesh (@BJP4UP) February 10, 2022
ప్రతిపక్షాలపై విరుచుకుపడిన ఆయన.. ఓటు బ్యాంకుల వ్యాపారం చేస్తున్న వారు తమ అక్కాచెల్లెళ్లు కూడా మోడీకి మద్దతు ఇస్తున్నారని.. దీంతో వారికి చుక్కలు కనిపిస్తున్నాయని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లకల్లోల రహితంగా ఉంచడానికి, మహిళలకు భయం లేకుండా చేయడానికి .. నేరస్థులను జైలుకు పంపడానికి బిజెపి ప్రభుత్వం అవసరమని ఆయన అన్నారు. మోదీకి ముస్లిం మహిళలు ఇస్తున్న మద్దతును వారు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రధాని ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు.
ముస్లిం మహిళలు వెనుకబడి ఉండాలని వారు కోరుకుంటున్నారు. కానీ మేము ముస్లిం మహిళలందరితో మా పార్టీ ఉందని గుర్తు చేస్తున్నాం. ముస్లిం మహిళలకు భద్రత, రక్షణ కోసం యోగిజీ ప్రభుత్వం యూపీలో అవసరం ఉందన్నారు. పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే డబ్బు చిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లేలా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అవసరమని ప్రధాని మోడీ అన్నారు.
ఇవి కూడా చదవండి: Great Khali: ఎన్నికల వేల బీజేపీలో చేరిన మహా బలుడు.. ప్రధాని మోడీపై ది గ్రేట్ ఖలీ ప్రశంసలు..
Nails Care Tips: గోర్లు త్వరగా విరిగిపోతున్నాయా.. ఈ 6 రెమెడీస్‌తో వాటిని బలంగా.. అందంగా చేసుకోండి..