AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ నటుడి రేంజ్ పెరిగిపోయింది.. ఏకంగా స్టార్ హీరో దంపతుల నుంచే సర్‌ప్రైజ్ గిఫ్ట్.. గుర్తు పట్టారా?

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు ప్రియదర్శి పులికొండ. వరుసగా సినిమాలు చేయడమే కాకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. తాజాగా విడుదలైన ఓ సినిమాలో ఈ హీరో నటనకు ఫిదా అయిన స్టార్ దంపతులు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు.

Tollywood: ఈ నటుడి రేంజ్ పెరిగిపోయింది.. ఏకంగా స్టార్ హీరో దంపతుల నుంచే సర్‌ప్రైజ్ గిఫ్ట్.. గుర్తు పట్టారా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Apr 26, 2025 | 11:56 AM

Share

ఇటీవలే కోర్టు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ప్రియదర్శి పులికొండ. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుండగానే మరో సినిమాతో మన ముందుకొచ్చాడీ యంగ్ అంగ్ ట్యాలెంటెడ్ హీరో. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియ దర్శి నటించిన తాజా చిత్రం సారంగ పాణి జాతకం. జాతకాలు, జ్యోతిష్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 25) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ప్రియదర్శి ఖాతాలో మరో హిట్ పడినట్టేనంటున్నారు సినీ ఫ్యాన్స్. కాగా సారంగపాణి జాతకం ముందు కోర్టు సినిమాలో నటించాడీ యంగ్ హీరో. అందులో లాయర్ సూర్య తేజ పాత్రలో అద్భుతంగా నటించాడు. మెగాస్టార్ చిరంజీవి లాంటి సినీ ప్రముఖులతో పాటు విమర్శకులు కోర్టు సినిమాను ప్రశంసించారు. ప్రియదర్శి నటన అద్భుతంగా ఉందంటూ మెచ్చుకున్నారు. తాజాగా ఇదే మూవీలో ప్రియదర్శి నటనకు కోలీవుడ్ స్టార్ దంపతులు ఫిదా అయిపోయారు. అందుకే ఈ యంగ్ హీరోను ప్రశంసిస్తూ ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపారు. వారేవరో కాదు సూర్య- జ్యోతిక దంపతులు. కోర్టు సినిమాలో ప్రియదర్శి నటనను మెచ్చుకుంటూ అతనికి ఓ ఫ్లవర్‌ బొకేతో పాటు చిన్న లెటర్‌ను పంపించారీ లవ్లీ కపుల్. ఈ విషయాన్ని ప్రియదర్శి సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు.

‘మీరు పంపిన సందేశం, పువ్వులు అందుకోవడం నా హృదయాన్ని తాకింది. ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. ఇద్దరు న్యాయవాదులు చంద్రు, వెంబా వెనక నుంచి గర్వంగా నన్ను తట్టినట్లుగా అనిపించింది. నన్ను బాగా ప్రేరేపించిన ఆ ఇద్దరికీ చాలా ధన్యవాదాలు’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు ప్రియదర్శి. ప్రస్తుతం ఈ నటుడి పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ప్రియదర్శి ట్వీట్..

ఇక సారంగపాణి జాతకం సినిమా విషయానికి వస్తే.. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ ఫన్ ఎంటర్ టైనర్ లో రూప కొడువాయూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే వీకే నరేశ్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, హర్ష చెముడు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చీకట్లో ఫోన్ వాడుతున్నారా? ఈ కంటి వ్యాధి వచ్చే ప్రమాదం.. జాగ్రత్త
చీకట్లో ఫోన్ వాడుతున్నారా? ఈ కంటి వ్యాధి వచ్చే ప్రమాదం.. జాగ్రత్త
తల్లి ఇంటికొచ్చేసరికి వేలాడుతూ కనిపించిన కూతురు.. జరిగిన ఘోరం..
తల్లి ఇంటికొచ్చేసరికి వేలాడుతూ కనిపించిన కూతురు.. జరిగిన ఘోరం..
ఒక్క విజయం లేదు.. కట్‌చేస్తే.. ఐసీసీ నుంచి కోట్లల్లో ప్రైజ్ మనీ..
ఒక్క విజయం లేదు.. కట్‌చేస్తే.. ఐసీసీ నుంచి కోట్లల్లో ప్రైజ్ మనీ..
పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో తెలుసా..?
పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో తెలుసా..?
కుర్రాళ్లను ఉర్రూతలూగించిన గ్లామర్ బ్యూటీ.. ఏడేళ్లు మంచానికే..
కుర్రాళ్లను ఉర్రూతలూగించిన గ్లామర్ బ్యూటీ.. ఏడేళ్లు మంచానికే..
గవర్నమెంట్ టీచర్లకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఉచితంగా
గవర్నమెంట్ టీచర్లకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఉచితంగా
పెళ్లి కూతురిపై నోట్ల వర్షం.. రూ. 8.5 కోట్లు వెదజల్లిన ఫ్యామిలీ!
పెళ్లి కూతురిపై నోట్ల వర్షం.. రూ. 8.5 కోట్లు వెదజల్లిన ఫ్యామిలీ!
తరచుగా ఆకలిగా వేయడం మధుమేహం ప్రారంభ సంకేతమా..?
తరచుగా ఆకలిగా వేయడం మధుమేహం ప్రారంభ సంకేతమా..?
టీమిండియా ఆ బలహీనతపై సౌతాఫ్రికా బ్రహ్మాస్త్రం ఇతడే..
టీమిండియా ఆ బలహీనతపై సౌతాఫ్రికా బ్రహ్మాస్త్రం ఇతడే..
తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు.. చివరికి..
తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు.. చివరికి..