AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki: మారుతి సుజుకి బంపర్‌ ఆఫర్‌.. ఈ 4 కార్లపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్

Maruti Suzuki Offer:ఈ డిస్కౌంట్లలో కన్జ్యూమర్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు కలిసి ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి, స్టాక్ లభ్యతను బట్టి ఈ ఆఫర్లు మారవచ్చు. అందుకే ఖచ్చితమైన వివరాల కోసం స్థానిక డీలర్‌ను సంప్రదించడం మంచిది..

Maruti Suzuki: మారుతి సుజుకి బంపర్‌ ఆఫర్‌.. ఈ 4 కార్లపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్
Maruti Cars
Subhash Goud
|

Updated on: May 08, 2026 | 8:22 AM

Share

Maruti Suzuki Offer: మారుతీ సుజుకీ సంస్థ మే 2026 నెలలో తన పాపులర్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. బ్రెజ్జా, విక్టోరిస్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో మోడళ్లపై గరిష్టంగా రూ. 2.15 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

1. మారుతీ సుజుకీ ఇన్విక్టో (Maruti Suzuki Invicto):

డిస్కౌంట్: ఈ నెలలో దీనిపై అత్యధికంగా రూ. 2.15 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. దీని ధర రూ. 24.97 లక్షల నుండి రూ. 28.60 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్).

ప్రత్యేకత: ఇది టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారిత మోడల్. ఇందులో 2.0 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది.

2. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara):

హైబ్రిడ్ వేరియంట్ కొనుగోలుపై దాదాపు రూ. 1.85 లక్షల వరకు రోడ్ టాక్స్ మినహాయింపు లభిస్తుంది. అదనపు ఆఫర్లు: దీనికి అదనంగా రూ. 90,000 వరకు ఇతర ఆఫర్లు, 5 ఏళ్ల ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ.10.76 లక్షల నుండి రూ. 19.72 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్).

3. మారుతీ సుజుకీ విక్టోరిస్ (Maruti Suzuki Victoris):

డిస్కౌంట్: ఈ మిడ్-సైజ్ SUVపై మొత్తం రూ. 70,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీని ధర రూ. 10.50 లక్షల నుండి రూ.19.99 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్).

మైలేజీ: దీని పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 21.18 kmpl, హైబ్రిడ్ వేరియంట్ 28.65 kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

4. మారుతీ సుజుకీ బ్రెజ్జా (Maruti Suzuki Brezza):

డిస్కౌంట్: అత్యధికంగా అమ్ముడయ్యే ఈ SUVపై మే నెలలో రూ. 55,000 వరకు డిస్కౌంట్ ఉంది. దీని ధర రూ. 8.26 లక్షల నుండి రూ. 13.01 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). ఫీచర్స్ విషయానికొస్తే.. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో CNG ఆప్షన్ కూడా ఉంది.

ఈ డిస్కౌంట్లలో కన్జ్యూమర్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు కలిసి ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి, స్టాక్ లభ్యతను బట్టి ఈ ఆఫర్లు మారవచ్చు. అందుకే ఖచ్చితమైన వివరాల కోసం స్థానిక డీలర్‌ను సంప్రదించడం మంచిది.

ఇది కూడా చదవండి: Bank Account: ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా రూ.10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు! ఎలాగో తెలుసుకోండి

ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. రూ.లక్షకు రూ.14 లక్షలు.. ఇన్వెస్టర్లకు పండగే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కర్కాటకంలో మహా కలయిక.. ఈ 4 రాశుల వారికి ధనవర్షం, అదృష్టం డబుల్!
కర్కాటకంలో మహా కలయిక.. ఈ 4 రాశుల వారికి ధనవర్షం, అదృష్టం డబుల్!
నాలుగు గ్రహాల కటాక్షం.. అక్టోబర్ లోగా వీరు విజేతలు కాబోతున్నారు..
నాలుగు గ్రహాల కటాక్షం.. అక్టోబర్ లోగా వీరు విజేతలు కాబోతున్నారు..
రైతన్నలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు!
రైతన్నలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు!
అతి మంచితనం మీ జీవితాన్నే దెబ్బతీయొచ్చు.. చాణక్య నీతి హెచ్చరిక!
అతి మంచితనం మీ జీవితాన్నే దెబ్బతీయొచ్చు.. చాణక్య నీతి హెచ్చరిక!
మర్రి ఆకులను పూజలో వాడుతున్నారా? ఈ దేవతలకు సమర్పిస్తే శుభం..
మర్రి ఆకులను పూజలో వాడుతున్నారా? ఈ దేవతలకు సమర్పిస్తే శుభం..
కరోనా సృష్టించిన వుహాన్ ల్యాబ్‌కు అమెరికా నిధులా?
కరోనా సృష్టించిన వుహాన్ ల్యాబ్‌కు అమెరికా నిధులా?
పాము గుడ్లను తింటే మనిషి చనిపోతాడా..? 99శాతం మందికి తెలియని..
పాము గుడ్లను తింటే మనిషి చనిపోతాడా..? 99శాతం మందికి తెలియని..
ఐపీఎల్‌లోకి సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. వచ్చే ఏడాది సరికొత్తగా..
ఐపీఎల్‌లోకి సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. వచ్చే ఏడాది సరికొత్తగా..
అర్ధరాత్రి వదిన లేదని తెలిసి ఇంట్లోకి చొరబడ్డ మరదలు!
అర్ధరాత్రి వదిన లేదని తెలిసి ఇంట్లోకి చొరబడ్డ మరదలు!
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో దూరిన ఆవు,ప్లేయర్లు పరుగో పరుగు!వీడియో చూస్తే
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో దూరిన ఆవు,ప్లేయర్లు పరుగో పరుగు!వీడియో చూస్తే