AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. రూ.లక్షకు రూ.14 లక్షలు.. ఇన్వెస్టర్లకు పండగే!

Multibagger Stock: ఇన్వెస్టర్లకు ధనవంతులను చేసింది స్మాల్ క్యాప్ కేటగిరిలోని పేపర్ ప్రొడక్ట్స్ రంగానికి చెందిన గౌతమ్ ఎగ్జిమ్ లిమిటెడ్ ( Gautam Exim Limited ) కంపెనీ. తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో లక్ష రూపాయలు కాస్త 14 లక్షలుగా మారిపోయింది..

Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. రూ.లక్షకు రూ.14 లక్షలు.. ఇన్వెస్టర్లకు పండగే!
Multibagger Stock
Subhash Goud
|

Updated on: May 07, 2026 | 3:49 PM

Share

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో సరైన సమయంలో సరైన స్టాక్‌ను గుర్తిస్తే అది సంపదను ఎలా పెంచుతుందో చెప్పడానికి ఈ కంపెనీయే నిదర్శనం. స్మాల్ క్యాప్ కేటగిరీలోని పేపర్ ప్రొడక్ట్స్ రంగానికి చెందిన గౌతమ్ ఎగ్జిమ్ లిమిటెడ్ (Gautam Exim Limited) తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకేసారి స్టాక్ స్ప్లిట్, బోనస్ షేర్లను ప్రకటించి ఇన్వెస్టర్లను ఖుషీ చేసింది. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఏప్రిల్ 30న జరిగిన బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో 1:2 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టేందుకు ఆమోదం లభించింది.

ఇది కూడా చదవండి: Silver Price: వెండి ధర జోరు.. 3 రోజుల్లో రూ. 13,000 పెరుగుదల.. అయినా ఆల్‌టైమ్ హై కంటే తక్కువే!

100 షేర్లు ఉంటే 800 షేర్లు ఎలా వస్తాయి?

కంపెనీ బోర్డు డైరెక్టర్ల నిర్ణయం ప్రకారం.. రెండు రకాల ప్రయోజనాలు ఇన్వెస్టర్లకు అందనున్నాయి.

ఇవి కూడా చదవండి

స్టాక్ స్ప్లిట్ (1:2): రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న ఒక షేరు, రూ. 5 ఫేస్ వ్యాల్యూ గల రెండు షేర్లుగా మారుతుంది. అంటే మీ వద్ద ఉన్న 100 షేర్లు 200 అవుతాయి.

బోనస్ షేర్లు (3:1): స్ప్లిట్ తర్వాత మీ వద్ద ఉన్న ప్రతి 1 షేరుకు అదనంగా 3 షేర్లు బోనస్‌గా లభిస్తాయి. అంటే పైన చెప్పుకున్న 200 షేర్లకు అదనంగా 600 షేర్లు వస్తాయి. మొత్తంగా: మీ వద్ద ఉన్న 100 షేర్లు కాస్తా 800 షేర్లుగా మారుతాయి. దీనికి సంబంధించిన రికార్డు తేదీని కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.

అద్భుతమైన రిటర్న్స్:

ఈ స్టాక్ గత ఐదేళ్లలో ఇన్వెస్టర్ల అదృష్టాన్ని మార్చేసింది.

5 ఏళ్లలో రిటర్న్స్: ఏకంగా 1296% లాభాన్ని అందించింది. అంటే ఐదేళ్ల క్రితం ఎవరైనా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని విలువ ఇప్పుడు దాదాపు రూ. 14 లక్షలకు పైమాటే. గత ఏడాది కాలంలోనే ఈ షేరు 179% వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని చూస్తే.. గౌతమ్ ఎగ్జిమ్ షేరు ప్రస్తుతం రూ. 310 – రూ. 324 మధ్య ట్రేడవుతోంది. దీని 52 వారాల గరిష్ట ధర రూ. 369.50 కాగా, కనిష్ట ధర రూ. 111.75. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ. 100 కోట్ల వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: LPG Cylinder Prices: గృహ వినియోగం నుండి వాణిజ్యం వరకు.. ఏ సిలిండర్ ఎంత ధర ఉందో తెలుసా?

ఇది కూడా చదవండి: Post Office: రూ. 2.25 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 98,016 వడ్డీ.. అదిరిపోయే ప్రభుత్వ పథకం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
200 మ్యాచ్‌ల రికార్డుతో సంచలనం సృష్టిస్తున్న స్వింగ్ కింగ్
200 మ్యాచ్‌ల రికార్డుతో సంచలనం సృష్టిస్తున్న స్వింగ్ కింగ్
సింగరకొండ ఆంజనేయుడు.. గుమ్మం దగ్గరే 99 అడుగుల మహావిగ్రహం! వాహన...
సింగరకొండ ఆంజనేయుడు.. గుమ్మం దగ్గరే 99 అడుగుల మహావిగ్రహం! వాహన...
ల్లెచెట్టు చిన్నదైనా కొమ్మకొమ్మకి విపరీతంగా పూలు పూయాలంటే
ల్లెచెట్టు చిన్నదైనా కొమ్మకొమ్మకి విపరీతంగా పూలు పూయాలంటే
మనోవేదనలోనూ మానవత్వం చాటుకున్న తల్లిదండ్రులు..!
మనోవేదనలోనూ మానవత్వం చాటుకున్న తల్లిదండ్రులు..!
అదృష్టం అంటే ఇదేనేమో..రూ.లక్షకు రూ.14 లక్షలు..ఇన్వెస్టర్లకు పండగే
అదృష్టం అంటే ఇదేనేమో..రూ.లక్షకు రూ.14 లక్షలు..ఇన్వెస్టర్లకు పండగే
ఏంట్రా ఇలా ఉన్నావ్.. అప్పుగా సిగరెట్ ఇవ్వలేదని కత్తితో పోడిచాడు..
ఏంట్రా ఇలా ఉన్నావ్.. అప్పుగా సిగరెట్ ఇవ్వలేదని కత్తితో పోడిచాడు..
మరణంలోనూ వీడని బంధం.. ఒకే రోజు రాత్రి వృద్ద దంపతుల మృతి!
మరణంలోనూ వీడని బంధం.. ఒకే రోజు రాత్రి వృద్ద దంపతుల మృతి!
కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోవాలి.. విజయవంతుల సీక్రెట్స్
కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోవాలి.. విజయవంతుల సీక్రెట్స్
విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే
హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే