AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinder Prices: గృహ వినియోగం నుండి వాణిజ్యం వరకు.. ఏ సిలిండర్ ఎంత ధర ఉందో తెలుసా?

LPG Cylinder Prices: దేశంలో వివిధ రకాల సిలిండర్లు ఉన్నాయి. గృహ వినియోగం కోసం ఉపయోగించే సిలిండర్ల నుండి, పెద్ద హోటల్ వ్యాపారవేత్తలు ఉపయోగించే సిలిండర్ల ధరలు రకరకాలుగా ఉన్నాయి. ప్రతి రకం సిలిండర్ భిన్నంగా ఉంటుంది. అలాగే వాటి ధరలు కూడా..

LPG Cylinder Prices: గృహ వినియోగం నుండి వాణిజ్యం వరకు.. ఏ సిలిండర్ ఎంత ధర ఉందో తెలుసా?
Lpg Gas
Subhash Goud
|

Updated on: May 07, 2026 | 3:02 PM

Share

LPG Cylinder Prices: గతంలో పొయ్యి మీద వంట చేసేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఉంది. దేశంలో వివిధ రకాల సిలిండర్లు ఉన్నాయి. గృహ వినియోగం కోసం ఉపయోగించే సిలిండర్ల నుండి, పెద్ద హోటల్ వ్యాపారవేత్తలు ఉపయోగించే సిలిండర్ల ధరలు రకరకాలుగా ఉన్నాయి. ప్రతి రకం సిలిండర్ భిన్నంగా ఉంటుంది. అలాగే వాటి ధరలు కూడా వేర్వేరుగా ఉంటాయి. అందుకే ఏ సిలిండర్ ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు? ఆ సిలిండర్ ధరలు ఏమిటో తెలుసుకోండి.

  1. గృహ వినియోగ (Domestic) సిలిండర్లు: సాధారణంగా ప్రతి ఇంట్లో ఉపయోగించే సిలిండర్లు ఇవే. వీటిలో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. 14.2 కిలోల సిలిండర్: అత్యధికంగా వాడే ఈ సిలిండర్ ధర ప్రస్తుతం సుమారు రూ.913 ఉంది. హైదరాబాద్‌లో రూ.965 ఉంది. 5 కిలోల సిలిండర్: చిన్న కుటుంబాలకు లేదా తాత్కాలిక అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. దీని ధర రూ.339.
  2. ఎక్స్‌ట్రాలైట్ (XTRALITE) సిలిండర్లు: ఇవి ఆధునిక సాంకేతికతతో తయారైన తేలికపాటి సిలిండర్లు. వీటి ప్రత్యేకత ఏంటంటే, ఇందులో గ్యాస్ ఎంత ఉందో బయటికే కనిపిస్తుంది. 10 కిలోల ఎక్స్‌ట్రాలైట్: దీని ధర రూ.652.5 గా ఉంది. వివిధ రకాల్లో లభించే ఈ సిలిండర్ల ధరలు వాటి పరిమాణాన్ని బట్టి రూ.339 నుండి రూ.826 వరకు మారుతుంటాయి.
  3. వాణిజ్య (Commercial) సిలిండర్లు: హోటళ్లు, రెస్టారెంట్లు, డెయిరీ ఫామ్స్‌లో వీటిని ఉపయోగిస్తారు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్: దీని ధర గరిష్టంగా రూ.3,071 కు చేరుకుంది. హై-ఎఫిషియన్సీ సిలిండర్లు: వీటి ధరలు రూ.3,094 నుండి రూ.3,225 మధ్యలో ఉన్నాయి.
  4. భారీ పరిశ్రమల కోసం పెద్ద సిలిండర్లు: పెద్ద హోటళ్లు లేదా పరిశ్రమల అవసరాల కోసం అధిక సామర్థ్యం గల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. 47.5 కిలోల సిలిండర్: దీని ధర సుమారు రూ.7,674 నుండి రూ.7,730 వరకు ఉంటుంది. ఇండస్ట్రియల్ బల్క్ సిలిండర్ (425 కిలోలు): అతిపెద్ద వ్యాపార సంస్థలు, ఫ్యాక్టరీల కోసం వాడే ఈ సిలిండర్ ధర రూ.68,707 నుండి రూ.69,209 వరకు ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. గృహేతర (Non-Domestic) చిన్న సిలిండర్లు: చిన్న దుకాణాలు, కుటీర పరిశ్రమల కోసం ఇవి ఉపయోగపడతాయి. 5 కిలోల నాన్-డొమెస్టిక్: దీని ధర రూ.810 నుండి ప్రారంభమవుతుంది. మరికొన్ని రకాల ధరలు రూ.1,754 నుండి రూ.1,770 వరకు ఉన్నాయి.

గమనిక: పైన పేర్కొన్న ధరలు ప్రాంతాన్ని బట్టి, పన్నుల (Taxes) ఆధారంగా స్వల్పంగా మారే అవకాశం ఉంది. మీ ప్రాంతంలోని తాజా ధరల కోసం అధికారిక గ్యాస్ ఏజెన్సీని సంప్రదించడం మంచిది.

ఇది కూడా చదవండి: Silver Price: వెండి ధర జోరు.. 3 రోజుల్లో రూ. 13,000 పెరుగుదల.. అయినా ఆల్‌టైమ్ హై కంటే తక్కువే!

ఇది కూడా చదవండి: Post Office: రూ. 2.25 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 98,016 వడ్డీ.. అదిరిపోయే ప్రభుత్వ పథకం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us