AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price: వెండి ధర జోరు.. 3 రోజుల్లో రూ. 13,000 పెరుగుదల.. అయినా ఆల్‌టైమ్ హై కంటే తక్కువే!

SIlver Price: ఒకప్పుడు పరుగులు పెట్టిన వెండి ధర.. ప్రస్తుతం దిగి వస్తోంది. మూడు రోజుల్లోనే వెండి ధర పెరిగినప్పటికీ ఆల్‌టైమ్ హై కంటే తక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే గతంలో కిలో వెండి ధర ఏకంగా రూ.4 లక్షల వరకు వెళ్లింది. కానీ ఇప్పుడు లక్షకుపైగా తగ్గిపోయింది..

Silver Price: వెండి ధర జోరు.. 3 రోజుల్లో రూ. 13,000 పెరుగుదల.. అయినా ఆల్‌టైమ్ హై కంటే తక్కువే!
Silver Rate
Subhash Goud
|

Updated on: May 07, 2026 | 2:20 PM

Share

Silver Price: గత కొన్ని రోజులుగా పతనమవుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే వెండి ధర ఏకంగా 13,000 రూపాయల మేర పెరగడం గమనార్హం.

వెండి ధరల ప్రస్తుత పరిస్థితి:

మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధరలు గురువారం ట్రేడింగ్ ప్రారంభంతోనే భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ. 2,53,265 వద్ద ముగిసిన వెండి, నేడు మరింత పెరిగింది. గత మూడు రోజుల్లో జరిగిన ఈ భారీ పెరుగుదల ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.70,000 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరలు కూడా పైపైకే..

కేవలం వెండి మాత్రమే కాదు, పసిడి కూడా అదే బాటలో పయనిస్తోంది. వరుసగా పెరుగుతున్న ధరలతో బంగారం మళ్లీ సామాన్యులకు భారంగా మారుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా 24 క్యారెట్ల బంగారం ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.

వెండి ధర మూడు రోజుల్లో రూ. 13,000 పెరిగింది.

గరిష్ట ధరతో పోలిక: ప్రస్తుత ధరలు భారీగా పెరిగినప్పటికీ, గతంలో నమోదైన రికార్డు గరిష్ట స్థాయి కంటే తక్కువగానే ఉన్నాయి. ఒకప్పుడు కిలో వెండి ధర ఏకంగదా 4 లక్షల రూపాయల వరకు వెళ్లింది. తర్వాత క్రమంగా దిగి వచ్చింది. మార్కెట్ ట్రెండ్: ధరలు కనిష్ట స్థాయికి పడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ ‘రికవరీ’ మోడ్‌లోకి వచ్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెరుగుతున్న ఈ ధరలు మున్ముందు ఎలా ఉంటాయో వేచి చూడాలి. మీరు ఒకవేళ పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే లేదా ఆభరణాలు కొనాలనుకుంటే, తాజా ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది.

ఇది కూడా చదవండి: SBI FD Interest: ఎస్‌బీఐ 444 రోజుల ఎఫ్‌డీలో రూ.2,50,000 పెట్టుబడిపై మీకు ఎంత వడ్డీ లభిస్తుంది?

ఇది కూడా చదవండి: Petrol Price Hike: చేదు వార్త.. భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచక తప్పదా? IMF షాకింగ్ కామెంట్స్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోవాలి.. విజయవంతుల సీక్రెట్స్
కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోవాలి.. విజయవంతుల సీక్రెట్స్
విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే
హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే
ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. డబ్బే డబ్బు!
ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. డబ్బే డబ్బు!
లక్నోను ఇంటికి పంపేందుకు సిద్ధమైన బెంగళూరు కుర్రాళ్లు
లక్నోను ఇంటికి పంపేందుకు సిద్ధమైన బెంగళూరు కుర్రాళ్లు
గృహ వినియోగం నుండి వాణిజ్యం వరకు.. ఏ సిలిండర్ ఎంత ధర ఉందో తెలుసా?
గృహ వినియోగం నుండి వాణిజ్యం వరకు.. ఏ సిలిండర్ ఎంత ధర ఉందో తెలుసా?
ఎలుకల ద్వారా వచ్చే వైరస్ ఓడలో ఎలా?
ఎలుకల ద్వారా వచ్చే వైరస్ ఓడలో ఎలా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
Polycet 2026లో టాప్‌లేపిన గోదారోళ్లు.. 16మందికి 120కి 120మార్కులు
Polycet 2026లో టాప్‌లేపిన గోదారోళ్లు.. 16మందికి 120కి 120మార్కులు
కమిన్స్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'.. కెప్టెన్ ఎందుకు షాకయ్యాడు ?
కమిన్స్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'.. కెప్టెన్ ఎందుకు షాకయ్యాడు ?