AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్‌ గోడౌన్‌లో చోరీ.. భారీగా సిలిండర్లు మాయం..

గ్యాస్‌ గోడౌన్‌లో చోరీ.. భారీగా సిలిండర్లు మాయం..

Phani CH
|

Updated on: May 07, 2026 | 6:59 PM

Share

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని మనిషా ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో భారీ చోరీ జరిగింది. పక్కా ప్లాన్‌తో వచ్చిన దుండగులు 51 నిండు, 31 ఖాళీ సిలిండర్లతో కలిపి మొత్తం 82 గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లారు. దొంగలు పట్టుబడకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డారు. కోహీర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

సంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. కోహీర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి వేళ బీభత్సం సృష్టించారు. పక్కా ప్లాన్‌తో వచ్చిన దుండగులు మనిషా ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ గోడౌన్‌ను టార్గెట్ చేసి, ఏకంగా 82 సిలిండర్లను ఎత్తుకెళ్లారు. ఈ భారీ దోపిడీ స్థానికంగా సంచలనం రేపింది. సోమవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో దొంగలు తమ ఆపరేషన్ మొదలుపెట్టారు. గోడౌన్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన నిందితులు.. అక్కడ స్టోర్‌చేసి ఉంచిన 51 నిండు సిలిండర్లతో పాటు, మరో 31 ఖాళీ సిలిండర్లను తమ వెంట తెచ్చుకున్న వాహనాల్లో వేసుకొని పారిపోయారు. చోరీకి ముందు తాము పట్టుబడకుండా ఉండేందుకు గోడౌన్ వద్ద ఉన్న రెండు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. టెక్నాలజీకి దొరక్కుండా, క్లూస్ వదలకుండా వారు వ్యవహరించిన తీరు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. మంగళవారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది తాళాలు పగిలి ఉండటం చూసి యజమాని గోపాల్‌కు సమాచారం అందించారు. ఏజెన్సీ యజమాని ఫిర్యాదుతో కోహీర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ సాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరగుండు, చెప్పుల దండతో.. యువకుడి ఊరేగింపు.. కారణం ఇదే!

మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. వజ్రాల బ్లౌజ్‌తో మెరిసిపోతూ..

Thalapathy Vijay: బక్కచిక్కిన కుర్రాడు టూ CM.. చరిత్ర సృష్టించడం అంత సులువు కాదు

Varanasi: సినిమా షూటింగ్ కోసం 150ట్యాంకర్ల డ్రింకింగ్ వాటరా..? జక్కన్నకు వాటర్ బోర్డ్ ఝలక్

Jana Nayagan: జననాయగన్‌ సినిమా పేరు మారుతుందా ??

Follow Us