Varanasi: సినిమా షూటింగ్ కోసం 150ట్యాంకర్ల డ్రింకింగ్ వాటరా..? జక్కన్నకు వాటర్ బోర్డ్ ఝలక్
హైదరాబాద్‌లో వేసవిలో తీవ్రమైన నీటి సమస్య నెలకొన్న నేపథ్యంలో, ఎస్.ఎస్. రాజమౌళి తన 'వారణాసి' సినిమా షూటింగ్ కోసం 150 వాటర్ ట్యాంకర్లు కావాలని హైదరాబాద్ వాటర్ బోర్డును కోరారు. అయితే, నగర ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, బోర్డు ఈ విజ్ఞప్తిని తిరస్కరించింది. ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుండగా, సినిమా షూటింగ్‌ల కోసం భారీగా నీటి వినియోగంపై ఇప్పుడు చర్చ మొదలైంది.
ఎండాకాలంలో… హైదరాబాద్‌లో నీళ్ల సమస్య ఏర్పడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. చాలా అపార్ట్‌మెంట్స్, విల్లాలు.. తమ డెయిలీ అవసరాల కోసం.. నిత్యం ట్యాంకర్లు తెప్పించుకోవాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ఓ పక్క విపరీతంగా పని చేస్తుంటారు. కావాల్సిన వారికి వాటర్ ట్యాంకర్లలో నీటిన సప్లై చేస్తూనే ఉంటారు. ఇలాంటి ఈ సిట్యూవేషన్‌లో.. తన వారణాసి సినిమా షూటింగ్ కోసం జక్కన్న భారీగా వాటర్ కోరడం ఇప్పుడు వివాదంగా మారింది. మహేష్‌బాబు, ప్రియాంక చోప్రా నటిస్తున్న ఎస్.ఎస్. రాజమౌళి కొత్త చిత్రం ‘వారణాసి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షర వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ కోసం.. దాదాపు 150 ట్యాంకర్ల నీరు కావాలంటూ.. జక్కన్న హైదరాబాద్ వాటర్ బోర్డు ను రిక్వెస్ట్ చేశారు. అయితే ఈ రిక్వెస్ట్‌ను మారు ఆలోచన లేకుండా.. హైదరాబాద్ వాటర్ బోర్డ్ తిరస్కరించింది. రాజేంద్రనగర్ పరిధిలోని గగన్‌పహాడ్‌లో ఏర్పాటు చేసిన స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా నీటిలో తీసే కొన్ని సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ఒక కుంటను నిర్మించినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీ దుర్గా ఆర్ట్స్ ప్రతినిధులు HMWSSBని సంప్రదించారు. ఒక్కోటి 10 వేల లీటర్ల సామర్థ్యం గల 150 ట్యాంకర్ల నీరు కావాలని విజ్ఞప్తి చేశారు. రవాణా ఖర్చులను కూడా భరిస్తామని మెన్షన్ చేశారు. ఈ నెల 18న షూటింగ్ నిర్వహించాల్సి ఉండటంతో, శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని కోరినట్లు సమాచారం. అయితే నగరంలో ఇప్పటికే నీటి సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, అంత పెద్ద మొత్తంలో నీటిని సినిమా అవసరాల కోసం కేటాయించడం సాధ్యం కాదని బోర్డు వర్గాలు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి సహా ట్యాంకర్ విభాగాధికారులు స్పందించలేదు. ఒకవైపు ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు సినిమా షూటింగ్‌ల కోసం భారీగా నీటి వినియోగంపై చర్చలు మొదలయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jana Nayagan: జననాయగన్ సినిమా పేరు మారుతుందా ??
Fauzi: ప్రభాస్ ఫౌజీ సినిమా టీంకు ప్రమాదం.. షూటింగ్‌కు బ్రేక్!
TVK Vijay: అప్పుడు NTR, ఇప్పుడు విజయ్! బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది..
ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే
తామర ఆకులనే ఫేస్ మాస్క్‌లుగా..! వేసవిలో వైరల్ ట్రెండ్
ఏనుగుకి కోపం వస్తే..రచ్చ రంబోలే.. వీడియో చూస్తే వణకాల్సిందే!
తెలంగాణలో 45 డిగ్రీలుదాటిన ఉష్ణోగ్రతలు
పవనన్నా.. నన్ను చంపేస్తారన్నా.. ప్లీజ్ కాపాడండి
జాతరలో తేనెటీగల బీభత్సం
రావిచెట్టుకు మామిడికాయలు.. ఆశ్చర్యంగా చూస్తున్న జనం!

