AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరగుండు, చెప్పుల దండతో.. యువకుడి ఊరేగింపు.. కారణం ఇదే!

అరగుండు, చెప్పుల దండతో.. యువకుడి ఊరేగింపు.. కారణం ఇదే!

Phani CH
|

Updated on: May 07, 2026 | 6:57 PM

Share

కర్నూలు జిల్లా అరికేరలో వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి అరగుండు చేయించి, చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ ఘటనతో రెండు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పోలీసులు గ్రామంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న నెపంతో ఒక యువకుడికి అరగుండు చేయించి, మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించిన ఘటన కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేర గ్రామంలో కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. అరికేర గ్రామానికి చెందిన ఒక వివాహిత పట్ల అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు గత కొంతకాలంగా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు సదరు యువకుడి కదలికలపై నిఘా పెట్టారు. మంగళవారం సదరు వ్యక్తి మళ్లీ వివాహితను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో, ఆగ్రహించిన కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం సదరు వ్యక్తికి అరగుండు, అరమీసం గీయించి , మెడలో చెప్పుల దండ వేసి వీధుల్లో ఊరేగించారు. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇరువురు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో గ్రామంలో కులపరమైన గొడవలు చెలరేగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమానవీయంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. వజ్రాల బ్లౌజ్‌తో మెరిసిపోతూ..

Thalapathy Vijay: బక్కచిక్కిన కుర్రాడు టూ CM.. చరిత్ర సృష్టించడం అంత సులువు కాదు

Varanasi: సినిమా షూటింగ్ కోసం 150ట్యాంకర్ల డ్రింకింగ్ వాటరా..? జక్కన్నకు వాటర్ బోర్డ్ ఝలక్

Jana Nayagan: జననాయగన్‌ సినిమా పేరు మారుతుందా ??

Fauzi: ప్రభాస్ ఫౌజీ సినిమా టీంకు ప్రమాదం.. షూటింగ్‌కు బ్రేక్!

Follow Us