శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో కేవలం రూ. 200 బాకీ కోసం జేసీబీ డ్రైవర్ వసంత కుమార్, కిరాణా వ్యాపారి మణికంఠపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సిగరెట్ కోసం వచ్చిన వసంత కుమార్ను మణికంఠ తల్లి పాత బాకీ అడగడంతో ఆగ్రహానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో మణికంఠను కదిరి ఆసుపత్రికి తరలించారు.