AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూముల రేట్లు భారీగా పెరగనున్నాయా..? హైదరాబాద్‌లో గజం ధరలు ఎలా ఉంటాయంటే..

తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న ధరలు, ప్రస్తుత మార్కెట్ ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉన్న ప్రాంతాల్లో భారీ పెంపు ఉండే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల వారీగా వివరాలు సేకరించిన అధికారులు ప్రాంతాలవారీగా కొత్త ధరలపై అధ్యయనం చేస్తున్నారు.

Prabhakar M
| Edited By: |

Updated on: May 07, 2026 | 9:47 PM

Share
25 శాతం నుంచి 100 శాతం వరకు పెంపు?ప్రాథమిక అంచనాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో 25 శాతం, మరికొన్ని చోట్ల 75 శాతం వరకు పెంపు ఉండొచ్చని సమాచారం. మార్కెట్ విలువతో పోలిస్తే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలు చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వంద శాతం వరకు కూడా పెంచే అవకాశాలపై చర్చ జరుగుతోంది. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరిధిలో భూముల ధరలు గత నాలుగేళ్లలో భారీగా పెరిగాయి. కానీ రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువలు మాత్రం తక్కువగానే కొనసాగుతున్నాయి. నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉందని అధికారులు గుర్తించారు.

1 / 5
కోర్ అర్బన్ ప్రాంతాల్లో చదరపు అడుగు ధర పెరుగుదల.. ప్రస్తుతం కోర్ అర్బన్ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ శాఖ ప్రకారం చదరపు అడుగు సగటు విలువ రూ.3500గా ఉంది. దీనిని 75 శాతం పెంచితే రూ.6125 వరకు చేరే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం రూ.1800గా ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ రేట్లను బట్టి రెండింతల పెంపు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. కొండాపూర్,గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ ప్రభావం..రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల ప్రకారం కొండాపూర్ – గచ్చిబౌలి ప్రాంతాల్లో గజం ధర ప్రస్తుతం సగటున రూ.26,700గా ఉంది. 75 శాతం పెంపు అమలైతే అది రూ.46,725కు చేరుతుంది. 25 శాతం పెరిగినా రూ.33,375 దాటుతుంది.

2 / 5
నార్సింగ్‌లో రియల్ ఎస్టేట్ జోరు.. నార్సింగ్ ప్రాంతంలో ప్రస్తుతం గజం విలువ రూ.23,800గా ఉంది. 75 శాతం పెరిగితే రూ.41,650 వరకు చేరే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో హైరైజ్ భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ రేట్లు ఇప్పటికే భారీగా ఉన్నాయి.ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వ దృష్టి.. ప్రస్తుతం ఫ్లాట్ల కొనుగోళ్ల ద్వారానే రిజిస్ట్రేషన్ శాఖకు సుమారు 65 శాతం ఆదాయం వస్తోంది. రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల మధ్య విలువైన ఫ్లాట్ల కొనుగోళ్లు పెరుగుతున్నందున, ఫ్లాట్ల విలువల పెంపు ద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

3 / 5
ఒక్కసారిగా కాదు.. విడతల వారీగా పెంపు..ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సూచనల మేరకు భారీ పెంపును ఒకేసారి అమలు చేయకుండా మూడు విడతల్లో అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా ప్రజలపై ఒక్కసారిగా భారం పడకుండా ఉంటుందని భావిస్తున్నారు.

4 / 5
ప్రతి ఏడాది స్వల్ప పెంపు దిశగా ఆలోచన..నాలుగేళ్లకోసారి భారీగా ధరలు పెంచడం కంటే ప్రతి ఏడాది స్వల్పంగా పెంచే విధానాన్ని అమలు చేయాలని కూడా సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర తరహాలో ప్రతి ఏడాది కనీసం 2 శాతం పెంపు విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

5 / 5
Follow Us
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!

ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..

మన అకౌంట్‌లో పొరపాటున డబ్బు క్రెడిట్‌ అయితే ఏం చేయాలి?

మీకు అతిగా వేడి అనిపిస్తుందా? శరీరంలో ఆ విటమిన్ తగ్గిందేమో

అద్భుతం.. శివాలయం తలుపులు తెరవగానే కనిపించిన సీన్ చూసి..

రోహిత్ 45 జెర్సీ గౌరవం కాపాడిన తెలుగోడు
రోహిత్ 45 జెర్సీ గౌరవం కాపాడిన తెలుగోడు
ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. 1523 యూనివర్సిటీ అధ్యాపక పోస్ట

బాడీ మొత్తాన్ని క్షణాల్లో కూల్ చేసే గిరిజనుల వంటకం

వెల్లుల్లిని ఇలా తిన్నారంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..బిందాస్!